iDreamPost

సైలెంట్​గా OTTలోకి వచ్చేసిన చిన్న సినిమాలు!

  • Author singhj Updated - 11:33 PM, Thu - 2 November 23
  • Author singhj Updated - 11:33 PM, Thu - 2 November 23
సైలెంట్​గా OTTలోకి వచ్చేసిన చిన్న సినిమాలు!

తెలుగు చిత్ర పరిశ్రమకు ఆగస్టు నెల ఏమాత్రం కలసిరాలేదు. ఈ నెలలో విడుదలైన తెలుగు సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ మూవీ ఎన్నో అంచనాల మధ్య విడుదలై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. చిరు కెరీర్​లో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా ఈ మూవీ నిలిచింది. రీఎంట్రీలో చిరంజీవికి షాక్ ఇచ్చిన ‘ఆచార్య’ కంటే కూడా ‘భోళా శంకర్’ కలెక్షన్లలో వెనుకబడింది. దీన్ని బట్టే మెహర్ రమేష్ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం రన్ ఎలా ముగిసిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆగస్టులో రిలీజైన తెలుగు సినిమాల్లో ఒకటి మాత్రం హిట్ స్టేటస్ తెచ్చుకుంది.

యంగ్ హీరో కార్తికేయ నటించిన ‘బెదురులంక 2012’ మూవీ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని నిర్మాతలకు, బయ్యర్లకు లాభాల పంట పండిస్తోంది. ఐదేళ్ల తర్వాత కార్తికేయకు ఈ సినిమా రూపంలో మరో సక్సెస్ లభించింది. ఆగస్టు నెలలో ఈ ఒక్క సినిమానే టాలీవుడ్ నుంచి బాగా పెర్ఫార్మ్ చేసింది. అసలు ఆ నెల సందడంతా తలైవా రజినీకాంత్ ‘జైలర్​’దే. ఈ మూవీతో రజినీ ఒక రేంజ్​లో కలెక్షన్స్ పిండుకున్నారు. అయితే ఆగస్టు నెల అయిపోవడంతో సెప్టెంబర్​ను వదిలేదే లేదంటూ వరుసగా తెలుగు సినిమాలు రిలీజ్​కు రెడీ అవుతున్నాయి. విజయ్ దేవరకొండ-సమంతల ‘ఖుషి’ ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ పాజిటివ్​ టాక్​తో దూసుకెళ్తోంది.

‘ఖుషి’ మినహా తెలుగు బాక్సాఫీస్ వద్ద పెద్ద చిత్రాలేవీ ఈ వారం విడుదల కావడం లేదు. ఓటీటీలోనూ పెద్ద మూవీస్ స్ట్రీమింగ్​ అవ్వడం లేదు. అయితే రెండు చిన్న చిత్రాలు మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఆ మూవీస్ ఏంటి? ఎందులో విడుదలయ్యాయో ఇప్పుడు చూద్దాం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్’. ఆగస్టు 12న బిగ్​స్క్రీన్స్​లోకి వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్​లో అందుబాటులోకి వచ్చేసింది. ఓ సాధారణ యువకుడు తనకు ఎదురైన అడ్డంకులు దాటుకొని ఎలా పైలట్ అయ్యాడు? అనేదే ‘ఉస్తాద్’ కథాంశం.

కథ బాగానే ఉన్నప్పటికీ మధ్యలో కాస్త ల్యాగ్ ఉండటం వల్ల థియేటర్లలో ‘ఉస్తాద్’ సరిగ్గా ఆడలేదు. అయితే ఓటీటీలో కాబట్టి చూసేయొచ్చు. ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మరో చిత్రం ‘నారాయణ అండ్ కో’. ఇందులో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ సుధాకర్ కోమకుల హీరోగా నటించారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఒక కుటుంబం చేసిన తింగరి పనులే ఈ సినిమా కథాంశం. ఈ రెండు సినిమాలతో పాటు ‘డీడీ రిటర్న్స్’ అనే తమిళ డబ్బింగ్ మూవీ, ‘స్కామ్ 2003: ఏ తెల్గీ స్టోరీ’ అనే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ కూడా తాజాగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేశాయి.

ఇదీ చదవండి:
కౌలు రైతులకు తోడుగా నిలబడే ప్రభుత్వం మాది: సీఎం జగన్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి