iDreamPost
android-app
ios-app

OTT Movie Suggestion: తెలుగులో హాలీవుడ్ రేంజ్ మర్డర్ మిస్టరీ! OTTలో ఎలా మిస్ అయ్యారు?

  • Published Jun 01, 2024 | 7:00 PM Updated Updated Jun 01, 2024 | 7:00 PM

మర్డర్ మిస్టరీస్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ ఈ జోనర్ సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో ఎప్పుడూ ముందుంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా మీరు మిస్ చేసిన మూవీస్ లిస్ట్ లో ఉందేమో ఓ లుక్ వేసేయండి.

మర్డర్ మిస్టరీస్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ ఈ జోనర్ సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో ఎప్పుడూ ముందుంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి ఈ సినిమా మీరు మిస్ చేసిన మూవీస్ లిస్ట్ లో ఉందేమో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 01, 2024 | 7:00 PMUpdated Jun 01, 2024 | 7:00 PM
OTT Movie Suggestion: తెలుగులో హాలీవుడ్ రేంజ్ మర్డర్ మిస్టరీ! OTTలో ఎలా మిస్ అయ్యారు?

మైండ్ గేమ్ ఆధారంగా సాగే కొన్ని మర్డర్ మిస్టరీస్ సినిమాలు ఉంటూ ఉంటాయి. మర్డర్ మిస్టరీస్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ ఈ జోనర్ సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో ఎప్పుడూ ముందుంటాయి. పైగా ఈ తరహా సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఎప్పుడు ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. దాదాపు ప్లాట్ ఒకటే అయినా కూడా ఆ కేసును ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేశారు అనే దానిపైనే ఆ మూవీ కథ అంతా కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ కోవకు చెందిందే. మరి మీరు మిస్ చేసిన సినిమాల లిస్ట్ లో ఈ సినిమా కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా కథేంటంటే.. భరత్ అనే ఓ వ్యక్తి ఓ కాల్ టాక్సీ డ్రైవర్. అతను హాస్పిటల్ నర్స్ గా పనిచేసే సుశీల అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటాడు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అయితే గణేష్ అనే అతను తనను ప్రేమించాలని సుశీలను వేధిస్తూ ఉంటాడు. గణేష్ వలన సుశీల మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది అమ్మాయిలు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఈ విషయం భరత్ కు తెలుస్తుంది. దీనితో గణేష్ కు వార్నింగ్ ఇవ్వడం కోసం అతని ఇంటికి వెళ్తాడు భరత్. కానీ అనుకోకుండా ఆ ఇంట్లో మాయా అనే అమ్మాయి మర్డర్ చేయబడి ఉంటుంది. ఆ హత్య కేసు కాస్త భరత్ పైన పడుతుంది. తానూ చేయని హత్య కేసులో భరత్ అన్యాయంగా ఇరుక్కుంటాడు. అసలు మాయను హత్య చేసింది ఎవరు ? అసలైన హంతకుడిని భరత్ పెట్టుకున్నాడా లేదా ? ఈ హత్య కేసులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యాడు? చివరికి కథ ఎలా ముందుకు కొనసాగింది ? అనేది తెలియాలంటే “రేయికి వేయి కళ్ళు” అనే ఈ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమా ప్రస్తుతం ఆహ లో స్ట్రీమింగ్ అవుతుంది. కంప్లీట్ మైండ్ గేమ్ ఆధారంగా సాగే ఈ మర్డర్ మిస్టరీ ఈ సినిమా అందరికి ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఇది ఓ తమిళ సినిమా నుంచి రూపొందించబడిన డబ్బింగ్ చిత్రం. ప్రేమ కథను మెయిన్ పాయింట్ గా తీసుకుని.. చివరి వరకు ట్విస్ట్ రివీల్ కాకుండా ఈ సినిమాను నడిపించాడు దర్శకుడు. ఎండ్ వరకు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది ఈ సినిమా. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయితే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet