iDreamPost
android-app
ios-app

OTT Best Horror Movie: Facebook లో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే చావే!.. OTT లో ఇలాంటి మూవీ చూసి ఉండరు.

  • Published Jun 10, 2024 | 2:47 PM Updated Updated Jun 10, 2024 | 2:47 PM

OTT Movie Suggestion: ఓటీటీ లోకి ఇప్పుడు అనేక సినిమాలు , సిరీస్ లు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో మూవీ లవర్స్ కొన్ని సినిమాలను మిస్ అయ్యే అవకాశం ఉంది. మరి మీరు మిస్ అయినా సినిమాలలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.

OTT Movie Suggestion: ఓటీటీ లోకి ఇప్పుడు అనేక సినిమాలు , సిరీస్ లు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో మూవీ లవర్స్ కొన్ని సినిమాలను మిస్ అయ్యే అవకాశం ఉంది. మరి మీరు మిస్ అయినా సినిమాలలో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 10, 2024 | 2:47 PMUpdated Jun 10, 2024 | 2:47 PM
OTT Best Horror Movie: Facebook లో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే చావే!.. OTT లో ఇలాంటి మూవీ చూసి ఉండరు.

ఈ వారం ఓటీటీ లోకి ఏ సినిమా వస్తుంది, వాటిలో ఏ ఏ సినిమాలు బాగున్నాయి. ఇలా ప్రతి వారం ఎప్పటికప్పుడు లిస్ట్ వస్తూనే ఉంటుంది. మూవీ లవర్స్ కూడా ఎప్పటికప్పుడు ఏ మూవీ ఎప్పుడు చూడాలా అని ప్లాన్ చేస్తూనే ఉన్నారు, ఈ క్రమంలో కొత్త సినిమాలనైతే చూస్తున్నారు కానీ.. ఆల్రెడీ ఉన్న కొన్ని సినిమాలను మిస్ చేసేస్తున్నారు మూవీ లవర్స్. వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మాత్రం ఇప్పటివరకు.. ఈవారం మిస్ చేస్తే మాత్రం ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. సాధారణంగా సోషల్ మీడియాలో స్ట్రాంజెర్స్ ను వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసి.. వాళ్ళతో ఫ్రెండ్ షిప్ చేస్తూ ఉండడం సహజం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా చూస్తే మాత్రం ఇలా చేయాలంటేనే వణుకు పుడుతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ మూవీ ఓపెనింగ్ సీన్ లో.. ఓ క్లాస్ లోకి ఓ ప్రొఫసర్ మరీనా మిల్స్ చనిపోయిందని చెప్తాడు. ఆమె సూసైడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందని.. దానిని ఎవరు షేర్స్ చేసి సస్పెండ్ అవుతారని అందరికి వార్నింగ్ ఇస్తాడు, అక్కడ అసలు ఏం జరిగిందంటే.. లారా అనే అమ్మాయి ఫేస్ బుక్ కు బాగా అడిక్ట్ అవుతుంది. అలా ఓ రోజు తన క్లాస్ లోని మరీనా నుంచి తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. లారా కూడా ఆ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేస్తుంది. అప్పటినుంచి లారాను కలవాలని.. మరీనా ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ.. ఆమెను విసిగిస్తూ ఉంటుంది. దీనితో ఓ సారి లారా ఆమె ప్రొఫైల్ ఓపెన్ చేయగా.. అందులో అన్నీ దెయ్యాలకు సంబంధించిన భయంకరమైన కొన్ని ఫొటోస్ ఉంటాయి.

Friend Request

ఓ రోజు లారా పుట్టిన రోజు వస్తుంది.. మారినా లారా పార్టీ అడుగుతుంది. కానీ లారా మారినాకు అబద్దం చెప్తుంది. తాను తన బాయ్ ఫ్రెండ్ తో పార్టీ చేసుకుంటున్నాని చెప్తుంది. కానీ లారా అబద్దం చెప్పిన సంగతి మరీనాకు తెలిసిపోతుంది. దీనితో నెక్ట్ డే మరీనా లారాతో గొడవ పడుతుంది. దీనితో మరీనాను అన్ ఫ్రెండ్ చేస్తుంది లారా. కట్ చేస్తే నెక్ట్ డే మరీనా సూసైడ్ చేసుకుందనే న్యూస్ బయటకు వస్తుంది. మరీనా చనిపోయిన రోజు రాత్రి తన ఫేస్ బుక్ నుంచి లారాకు ఓ మెసేజ్ వస్తుంది. అది ఏంటంటే మరీనా భయంకరంగా ఆత్మహత్య చేసుకున్న వీడియో. దినోతో దానిని డిలేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది లారా.

కానీ అది డిలేట్ అవ్వదు.. ఆమెకు తెలీకుండానే ఆమె ప్రొఫైల్ లో ఈ వీడియో అప్ లోడ్ అవుతుంది. దీనితో లారాకు ఈ ఆత్మహత్యలో సంబంధం ఉందని అనుకుంటారు పోలీసులు. ఇది ఇలా ఉంటె లారా ఫ్రెండ్స్ అంతా కూడా ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. అసలు వీళ్లంతా ఎందుకు చనిపోతారు ! మరీనా ఎందుకు చనిపోయింది ! ఆమె లారా నే ఎందుకు టార్గెట్ చేసింది ! ఆ తర్వాత ఏం జరిగింది ! ఇవన్నీ తెలియాలంటే “ఫ్రెండ్ రిక్వెస్ట్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibombetcio girişiptv satın alCasibom