iDreamPost
android-app
ios-app

OTT Best Horror Movie: ఎక్కిళ్లు వస్తే దెయ్యం వచ్చేస్తుంది.. OTTలో అందమైన అమ్మాయిలను భయపెట్టే బూతం!

  • Published Jun 10, 2024 | 4:56 PM Updated Updated Jun 10, 2024 | 4:56 PM

హర్రర్ సినిమాలంటే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి మీరు చూసిన సినిమాలలో లేదా మిస్ చేసిన సినిమాలో ఈ సినిమా కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.

హర్రర్ సినిమాలంటే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇలాంటిదే. మరి మీరు చూసిన సినిమాలలో లేదా మిస్ చేసిన సినిమాలో ఈ సినిమా కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 10, 2024 | 4:56 PMUpdated Jun 10, 2024 | 4:56 PM
OTT Best Horror Movie: ఎక్కిళ్లు వస్తే దెయ్యం వచ్చేస్తుంది.. OTTలో అందమైన అమ్మాయిలను భయపెట్టే బూతం!

హర్రర్ ప్లాట్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ.. వచ్చిన ప్రతి సినిమా కూడా కొత్తగానే ఉంటుంది. దెయ్యాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని.. దెయ్యలతో మాట్లాడాలని.. దెయ్యాలు ఉన్నాయా లేవా అని మరి కొందరు ఇలా ప్రతి సినిమాలోనూ ఎదో ఒక కొత్త కాన్సెప్ట్ ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంది. అందుకే హర్రర్ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. దాదాపు హర్రర్ మూవీ లవర్స్ అయితే ఈ సినిమాను మిస్ చేసి ఉండరు. ఒకవేళ మిస్ చేసి ఉంటె మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమాలో నటించిన నటి నటులంతా కూడా .. ప్రేక్షకులకు పరిచయం ఉన్నా టాలీవుడ్ నటి నటులే.. విశ్వక్ సేన్ , రకుల్ ప్రీత్ సింగ్ , నివేదా పేతు రాజ్. వీరితో పాటు. మేఘా ఆకాష్‌, మంజిమామోహ‌న్‌, రెబ్బాజ‌న్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఏ.ఎల్ విజ‌య్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథేంటంటే.. రకుల్ ఇంట్లో ఓ హాలోవీన్ పార్టీ జరుగుతూ ఉంటుంది. సో ఆ పార్టీకి తన ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అరుణ‌, రుతిక‌, కావ్య‌ల‌ను పార్టీలో భయపెట్టాలని ప్లాన్ చేస్తుంది. దానికోసం నలుగురు కలిసి హాలోవెన్ స్టోరీస్ అనే బుక్ ను చదవాలని ట్రై చేస్తారు . అంటే ఆ బుక్ చదవడం స్టార్ట్ చేస్తే.. చివరి వరకు చదవాలనేదే కండిషన్. ఒక్కో క‌థ ద్వారా ఒక్కో డిఫ‌రెంట్ హార‌ర్ స్టోరీస్‌ బయటపడుతుంది.

ఫ‌స్ట్ స్టోరీలో హిక‌ప్స్ మిడ్‌నైట్ టూలెట్ బోర్డ్ చూసి.. ఓ పెద్ద ఇంట్లో అద్దెకు దిగిన‌ ఓ జ‌ర్న‌లిస్ట్‌ కు ఎదురైన కొన్ని సంఘటనలు ఉంటాయి. ఇక త‌న కారు కింద ప‌డి చ‌నిపోయిన ఓ వృద్ధుడితో పాటు.. బాలుడు ఆత్మ‌లు మాళ‌వికా అనే అమ్మాయిని వెంబ‌డించ‌డంతో ఏం జరిగింది అనేది రెండో కథ. ఇంట్లో ఒంట‌రిగా ఉన్న జాన‌కికి ఓ ఆత్మ ఏ విధంగా చంప‌డానికి ప్ర‌య‌త్నించింద‌న్న‌ది మూడో క‌థ. ఇలా ఒక్కో స్టోరీలో అనేక మలుపులు ఉంటాయి. నివేథా పేతురాజ్‌, మేఘా ఆకాష్‌,మంజిమా మోహ‌న్‌, విశ్వ‌క్‌సేన్‌, రెబ్బా జాన్‌ జీవితాలు దెయ్యాలు కారణంగా ఏ విధంగా చిక్కుల్లో పడ్డాయి ! వీరి కథలు అసలు ఆ బుక్ లో ఎందుకు ఉంటాయి ! అసలు రకుల్ ఇంటికి వచ్చింది నిజంగా వారి ఫ్రెండ్స్ ఏ నా ! వారు మనుషులా లేక దెయ్యాలా ! ఇవన్నీ తెలియాలంటే “బూ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే చూడండి . ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPokerklasPokerklasPusulabetmeritbetCasibom GirişmeritbetholiganbetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis