iDreamPost

ఉస్మానియా యూనివర్సిటీలో ‘సివిల్స్‌’ ఫ్రీ కోచింగ్‌కు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే

  • Published Nov 20, 2023 | 3:25 PMUpdated Nov 20, 2023 | 3:25 PM

సివిల్స్‌కు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ఎంత కష్టమో.. ఇక దాని కోచింగ్‌ కూడా అదే రీతిలో భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ నేపథ్యంలో సివిల్స్‌కి ప్రిపేర్‌ అవుదామనుకువారికి శుభవార్త. ఫ్రీ కోచింగ్‌ ఇవ్వనున్నారు. పూర్తి వివరాలు..

సివిల్స్‌కు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ఎంత కష్టమో.. ఇక దాని కోచింగ్‌ కూడా అదే రీతిలో భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ నేపథ్యంలో సివిల్స్‌కి ప్రిపేర్‌ అవుదామనుకువారికి శుభవార్త. ఫ్రీ కోచింగ్‌ ఇవ్వనున్నారు. పూర్తి వివరాలు..

  • Published Nov 20, 2023 | 3:25 PMUpdated Nov 20, 2023 | 3:25 PM
ఉస్మానియా యూనివర్సిటీలో ‘సివిల్స్‌’ ఫ్రీ కోచింగ్‌కు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే

గవర్నెమెంట్‌ ఉద్యోగాల్లో అత్యుత్తమైన జాబ్‌గా భావించేది యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ సెలక్షన్. దీని కింద ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐఆర్‌ఎస్‌ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు భర్తీ చేస్తారు. దేశవ్యాప్తంగా లక్షల మంది ఈ ఉద్యోగాల కోసం పోటీ పడతారు. కానీ కొద్ది మంది మాత్రమే సెలక్ట్‌ అవుతారు. ఇక సివిల్స్‌కు ప్రిపేర్‌ అవ్వడం అంత తేలికైన అంశమేమి కాదు. ఎంతో కష్టమైంది మాత్రమే కాక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. చాలామంది సొంతంగా ప్రిపేర్‌ అవుతుంటారు. అలాంటి వారికి ఉస్మానియా యూనివర్సిటీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించి ఫ్రీ కోచింగ్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓయూ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఓయూ పరిధిలో చదువుకుంటున్న విద్యార్థులను.. సివిల్స్‌లో విజయం సాధించేలా చేసేందుకు గాను.. యూనివర్సిటీ.. ఉచిత శిక్షణకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సివిల్ సర్వీసెస్ అకాడమీలో ప్రత్యేక ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించారు. సివిల్స్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే ఓయూ విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పెరిగేలా, పరీక్షల్లో విజయం సాధించేలా దీని ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ప్రైవేటు కోచింగ్ కేంద్రాలకు ధీటుగా.. ఓయూలోని సివిల్ సర్వీస్ అకాడమీ ఆధ్వర్యంలో అర్హులైన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఆ వివరాలు..

ఎవరు అర్హులంటే..

ఉస్మానియా వర్సిటీ పరిధిలో పీజీ, పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులు ఈ ఫ్రీ కోచింగ్‌కు అప్లై చేసుకోవడానికి అర్హులు. వీరు డిసెంబర్ 2 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఓయూ వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తును పూర్తిచేసి, వాళ్లు అడిగిన సర్టిఫికెట్‌ జీరాక్స్‌ కాపీలను ఓయూ సివిల్ సర్వీసెస్ అకాడమీ కార్యాలయంలో అందజేయాలి. పూర్తి వివరాలకు 8331041332 ఫోన్ చేస్తే.. వారు మీరు పూర్తి వివరాలు అందజేస్తారు.

ఓయూ పీహెచ్‌డీ విద్యార్థులు, క్యాంపస్ కాలేజీలతో పాటు సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కాలేజీలు, నిజాం కళాశాలకు చెందిన పీజీ విద్యార్థులు ఈ ఫ్రీ కోచింగ్‌ పొందేందుకు అర్హులు. డిగ్రీ మార్కులు, పీజీ ఎంట్రన్స్‌లో సాధించిన ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాలను అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నాలుగున్నర నెలలపాటు సివిల్స్‌కు సంబంధించి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు.

స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైతే చాలు..

విద్యార్థులు ఓయూ సివిల్స్ అకాడమీలో ఉచితంగా శిక్షణ పొందాలంటే ముందుగా నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. ఈ పరీక్షలో పాసైన వారు మాత్రమే సివిల్స్‌ ఫ్రీ కోచింగ్‌ శిక్షణ పొందేందుకు అర్హులువుతారు. స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యే 100 మంది అభ్యర్థులను శిక్షణకు ఎంపికచేస్తారు. వీరికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు విశ్వవిద్యాలయంలోని అనుభవజ్ఞులైన ఆచార్యులు, వృత్తి నిపుణుల సహకారం తీసుకోనున్నారు.

ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లుకు ధీటుగా..

బయట సివిల్స్ శిక్షణ ఇస్తున్న ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లకు ధీటుగా.. ఓయూలో సివిల్స్ అకాడమీని రూపొందించారు అధికారులు. ఏకకాలంలో 500ల మంది విద్యార్థులు చదువుకునేలా విశాలమైన గదులు, అత్యాధునిక సమాచార పరిజ్ఞానంతో కూడిన శిక్షణ తరగతులు, డిజిటల్ లైబ్రరీతో పాటు కేంద్ర గ్రంథాలయం తరహాలో.. అతి పెద్ద లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు. సివిల్స్‌కు అవరసమైన అన్ని పుస్తకాలను ఇక్కడ అందుబాటులో ఉంచనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటున్నారు అధికారులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి