iDreamPost

టెన్త్, ITI పాస్ అయ్యారా?.. అయితే రైల్వేలో మూడు వేలకు పైగా ఉద్యోగాలు రెడీ

రైల్వే డిపార్ట్ మెంట్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. టెన్త్, ఐటీఐ అర్హతతో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఏకంగా మూడువేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

రైల్వే డిపార్ట్ మెంట్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. టెన్త్, ఐటీఐ అర్హతతో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఏకంగా మూడువేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

టెన్త్, ITI పాస్ అయ్యారా?.. అయితే రైల్వేలో మూడు వేలకు పైగా ఉద్యోగాలు రెడీ

మీరు పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారికి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. రైల్వేలో మూడు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని రైల్వేలో ఉద్యోగం పొందొచ్చు. తాజాగా రైల్వే రిక్రూట్ మెంట్ సెల్- వెస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 3015 ఖాలీలను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. త్వరగా అప్లై చేసుకోండి.

వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని డివిజన్‌/యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థలు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 14 2024 వరకు అవకాశం కల్పించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆశావాహులు వెస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్ సైట్ https://wcr.indianrailways.gov.in/ను పరిశీలించాల్సి ఉంటుంది.

jobs in raiway department

ముఖ్యమైన సమాచారం:

  • వెస్ట్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య:

  • 3,015.

యూనిట్లవారీగా ఖాళీలు:

  • జేబీపీ డివిజన్ 1164 పోస్టులు, బీపీఎల్ డివిజన్ 603 పోస్టులు, కోటా డివిజన్, 853 పోస్టులు, సీఆర్‌డబ్ల్యూఎస్ బీపీఎల్ 170 పోస్టులు, డబ్ల్యూఆర్ఎస్ కోటా 196 పోస్టులు, హెచ్‌క్యూ/జేబీపీ 29 పోస్టులు ఉన్నాయి.

అర్హత:

  • పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలి.

ట్రేడ్‌లు:

  • కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, పెయింటర్ (జనరల్), ప్లంబర్, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్, వెల్డర్ (గ్యాస్, ఎలక్ట్రిక్).

వయోపరిమితి:

  • 14.12.2023 నాటికి అభ్యర్థుల వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఎంపిక విధానం:

  • మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు:

  • దరఖాస్తు ఫీజు రూ.136 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.36 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తు ప్రారంభం:

  • 15-12-2023.

దరఖాస్తుకు గడువు:

  • 14-01-2024.

వెస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్ సైట్:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి