iDreamPost

మహాశివరాత్రి రోజు బిగ్ బాస్ ఫేమ్ కీర్తిభట్ షాకింగ్ కామెంట్స్!

  • Published Mar 09, 2024 | 8:32 AMUpdated Mar 09, 2024 | 8:32 AM

మహాశివరాత్రి పర్వదినాన దేశామంత శైవక్షేత్రాలతో, శివనానస్మరణతో మారుమోగిపోతుంటే.. అసలే దేవుడే లేడంటూ ఓ బుల్లితెర నటి సంచలన వ్యాఖ్యలు చేసింది.

మహాశివరాత్రి పర్వదినాన దేశామంత శైవక్షేత్రాలతో, శివనానస్మరణతో మారుమోగిపోతుంటే.. అసలే దేవుడే లేడంటూ ఓ బుల్లితెర నటి సంచలన వ్యాఖ్యలు చేసింది.

  • Published Mar 09, 2024 | 8:32 AMUpdated Mar 09, 2024 | 8:32 AM
మహాశివరాత్రి రోజు బిగ్ బాస్ ఫేమ్ కీర్తిభట్ షాకింగ్ కామెంట్స్!

మహాశివరాత్రి పర్వదినాన దేశామంత శైవక్షేత్రాలతో, శివనానస్మరణతో మారుమోగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహాశివరాత్రి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. కోట్లాది మంది భక్తులు ఉపవాసలు చేస్తూ భక్తితో ఆ మహా శివుని ధ్యానంలో పరమశమయ్యారు. మరి ఇలాంటి సమయంలో అసలు దేవుడే లేడంటూ ఓ బుల్లితెర నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా.. అసలు దేవడనేవాడు ఉంటే.. ఇన్ని దారుణాలు, కష్టలు ఉంటాయా. కష్టం వచ్చినప్పుడు కాపాడలేని దేవుడు.. కళ్లు మూసుకుని ఉన్నాడా అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ నటి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎంతో అనుకువుగా ఉన్న నటి ఇలా మహాశివరాత్రి పర్వదినాన్న దేవుడి పట్ల దారుణంగా షాకింగ్ కామెంట్స్ చేయడం పై అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇంతకి ఆమె ఎవరంటే..

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఈ మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో..అసలు దేవుడే లేడంటూ షాకింగ్ వీడియోను షేరు చేసింది బిగ్ బాస్ ఫేమ్, బుల్లితెర నటి కీర్తి భట్. తాజాగా ఓ వీడియోలో మాట్లాడిన కీర్తి భట్ ఏమన్నదంటే.. ‘అసలు శివరాత్రి అనే కాదు.. శివరాత్రి లేకపోయినా కూడా ఎంతోమంది ప్రతి రోజు దేవుడికి పూజ చేస్తూనే ఉంటారు.అసలు పొద్దున లేస్తే చాలు దేవుడు దేవుడు అంటూ.. పూజ చేసి, నైవేద్యం పెట్టి, ఉపవాసం చేస్తుంటారు. కానీ ఇవన్నీ చేయడానికి రీజన్ ఏమిటంటే.. ప్రతి ఒక్కరూ అన్నీ బాగా జరగాలి, అంతా మంచి జరగాలి, మమ్మల్ని కాపాడాలి.. మాకు సాయంగా ఉండాలని అనుకుంటారు. ఇక కష్టం వచ్చినప్పుడు ఏదొక రూపంలో వచ్చి.. సాయం చేయాలని దేవుడిని పూజిస్తుంటారు.కానీ, నాకు అనిపించేది ఏమిటంటే.. ఈ మధ్య ఓ చిన్నపాపని అతి దారుణంగా అంతమంది కలిసి రేప్ చేశారు. అప్పుడు దేవుడు ఎక్కడికి పోయాడు, ఎందుకు కాపాడలేకపోయాడు. పాపం చిన్న పిల్ల.. పెద్ద వాళ్లైతే ఏదొకటి చేస్తారు. అంత చిన్నపాపని దారుణంగా అంతమంది కలిసి రేప్ చేస్తుంటే.. దేవుడు ఏం చేస్తున్నాడు? కళ్లు మూసుకుని కూర్చున్నాడా? ఆ సమయంలో ఆ పాపకి ఎంత నొప్పి వచ్చి ఉంటుంది.

అలాగే పాప పేరెంట్స్ ఎంత పెయిన్ అనుభవించి ఉంటారు. అప్పుడు దేవుడు ఏదొక రూపంలో వచ్చి కాపాడాలి కదా.. కనీసం తప్పించుకోవడానికైనా మార్గం చూపాలి కదా, ఇక అలాంటి సాయం చేయని దేవుడు ఉండీ ఎందుకు? పైగా పసిపిల్లలంటే దేవునితో సమానం అంటారు కదా.. మరి ఆ పసిపిల్లలపై రేప్‌లు జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇందుకేనా మనం రోజు దేవుడికి పూజలు చేయాలి? ఇది చాలా దారుణం .. ఇవన్నీ చూస్తుంటే నాకు అసలు దేవుడే లేడనిపించింది. ఎందుకంటే.. ఆస్తులు ఉన్న వాళ్లకేమో ఇంకా ఇంకా ఆస్తులు ఇస్తూనే ఉంటారు. లేని వాళ్లకేమో లేనేలేదు. ఇవన్నీ పై నుంచి దేవుడు.. చూస్తూ ఉంటాడు. కానీ, మనం మాత్రం దేవుడా.. దేవుడా.. అని అంటాం. ఆ బాధలన్ని గుర్తు చేసుకుంటే.. అసలు దేవుడు ఫొటోలను బయటపెట్టేయాలనిపిస్తుంది. దేవుడు మనకి కనిపించరు.. ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడుతారు అనుకుంటాం. కానీ. ఆ సమయంలో దేవుడు కళ్లు మూసుకుని కూర్చుంటాడు. పైగా ఆ దేవుడు ఈ దేవుడు అని కాదు.. అన్ని దేవుళ్లూ కళ్లు మూసుకుని కూర్చున్నారు’ అంటూ తన జీవితంలో జరిగిన విషాద ఘటననను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది కీర్తి భట్.

కాగా, ఈమె బాధ వెనుకు చాలా విషాద ఘటనే ఉంది. కొన్నేళ్ల క్రితం ఓయాక్సిడెంట్ లో కీర్తి భట్ తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయింది. అలా జీవితంలో అడుగడుగున కష్టాలే చూసిన కీర్తి.. దేవుడే ఉంటే తనకి ఇన్ని కష్టాలు వచ్చేవా? అన్న ఉద్దేశంలో తన బాధను వ్యక్త పరిచి ఉండొచ్చు కానీ.. అవి చాలామంది భక్తుల మనోభావాలను దెబ్బతినేలా ఉండడంతో ఆమె పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి, కీర్తి భట్ దేవుడి గురించి చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి