iDreamPost

కర్వా చౌత్ రోజున భర్తపై భార్య దాడి.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ చూస్తే..

సరదాగా అప్పుడప్పుడు దంపతుల మధ్య గొడవలు, కోపతాపాలు రావడం సహజం. అలా అని నిత్యం కొట్టుకు చస్తుంటే.. ఇరుగిల్లు, పొరిగిల్లుకు ఓ వినోదాత్మకమైన చిత్రంగా మారిపోతుంది సంసారం. సర్దుకుపోయి.. బతకగలిగితేనే సంసారమనే నావ సవ్యంగా సాగిపోతుంది.. లేదంటే..

భార్యా, భర్తల మధ్య గిల్లికజ్జాలైన, గిలిగింతలు అయినా నాలుగు గోడల మధ్య జరిగితే అది అందమైన కాపురంగా మారుతుంది. లేదని రోడ్డు ఎక్కితే నవ్వుల పాలు అవుతుంది. దంపతులు పిల్లల ముందు దెబ్బలాడుకోవడాలు, బజారు ఎక్కి ఒకరికొకరు తిట్టుకున్నా, కొట్టుకున్నా చూసేవాడికి వినోదంగా ఉంటుంది కానీ.. అభాసుపాలు అవుతున్నామన్న మనం అనే ఆలోచన భార్యా భర్తలకు ఉండాలి. ముఖ్యంగా సమాజం ఆడవాళ్ల పోకడలను ఎత్తి చూపుతుంది. ఏదన్నా తప్పు మహిళదే అంటూ ఉంటుంది. భర్త బాగా చూసుకున్నా, చూసుకోకపోయినా సర్దుకు పోయినా నారీమణులు ఉన్నారు. అయితే అతడు ఏమన్నా తేడా చేస్తున్నాడని అనుకుందా ఇక అపర భద్రకాళి కావడం ఖాయం.

కర్వాచౌత్ పండుగ అంటే భర్తను గౌరవించడం, పూజించడం. ఈ మహిళ మాత్రం రివర్స్‌లో చేసింది. పెట్టే పట్టుకుని ఎక్కడికో వెళిపోతున్న భర్తను అడ్డుకోబోయింది. అయితే భర్త వెంటనే ఆమెపై ఇటుక రాయి ఎత్తి.. ఆ తర్వాత పడేశాడు. ఇదే అదునుగా చూసిన భార్య..ఆ ఇటుక రాయిని ఎత్తి.. అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. కోపంలో ఉన్న ఆమెకు గబుక్కున భర్త అతని గుర్తుకు వచ్చిందేమో వాటిని పడేసింది. ఆ తర్వాత ఆమెను వంచి మెడమీద,వీపు మీద రెండు దెబ్బలు వేశాడు భర్త. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు.. నెటిజన్లు పెట్టిన కామెంట్లు చూస్తే మాత్రం నవ్వు ఆపుకోకుండా ఉండలేరు. కర్వా చౌత్ రోజునైనా భర్తను వదిలేయాలని ఒకరు అంటే.. ఎక్కడికైనా వె ళ్లే ముందు భార్య అనుమతి తీసుకోవాలి కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంత మంది యాక్టింగా అంటూ తీసి పడేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి