iDreamPost

పుట్టిన రోజని బ్యూటీ పార్లర్‍కు వెళ్లింది.. తిరిగి వస్తూ..

కొన్ని సార్లు మన పొరపాట్ల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతూ ఉంటుంది. ఆ నష్టం పూడ్చలేనిది అయితే.. తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఈ ప్రపంచానికి సమాధానం చెప్పలేనిది అయితే.. అలాంటి సంఘటనలు..

కొన్ని సార్లు మన పొరపాట్ల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతూ ఉంటుంది. ఆ నష్టం పూడ్చలేనిది అయితే.. తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఈ ప్రపంచానికి సమాధానం చెప్పలేనిది అయితే.. అలాంటి సంఘటనలు..

పుట్టిన రోజని బ్యూటీ పార్లర్‍కు వెళ్లింది.. తిరిగి వస్తూ..

కొన్ని సార్లు ఊహించని ప్రమాదాలు.. ప్రాణాలు తీస్తుంటాయి. ఇదే కాన్సెప్ట్‌తో ఫైనల్ డెస్టినేషన్ అనే మూవీని తీశారు. ఇప్పటి వరకు 5 సిరిస్‌లు అలరించాయి. ఇలా కూడా చనిపోతారా అనిపించేలా ఉంటాయి ఆ సంఘటనలు. ఘోరాతి ఘోరంగా మృతి చెందుతూ ఉంటారు. సినిమాలోనే కాదూ నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. పెళ్లిలో కరెంట్ షాక్ కొట్టి వరుడు మృతి చెందడం, స్నానం చేస్తూ కాలు జారి పడి మరణించడం, చాలా రోజుల తర్వాత బంధువులను కలుస్తునాన్న ఆనందంలో ఉండగా.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడవడం వంటి ఘటనలు ఆ కోవ కిందకు వస్తాయి. పుట్టిన రోజు కావడంతో స్నేహితులతో సరదాగా గడిపిన అమ్మాయి.. ఓ పనిపై వెళుతూ మృత్యువాత పడింది.

తన పుట్టిన రోజే ఆమెకు లాస్ట్ డే అయ్యింది. చదివి.. తమను బాగా చూసుకుంటుందనుకున్న అమ్మాయి.. ఏ మాత్రం ఊహించలేని విధంగా అనంత లోకాలకు వెళ్లిపోయింది. బ్యూటీ పార్లర్ కని వెళ్లిన యువతి.. విగత జీవిగా ఇంటికి రావడంతో.. కూలి పనులు చేసుకుని బతుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఏమైందంటే.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తిరువూర్ రామ్ నగర్ ప్రాంతానికి చెందిన అన్బళగన్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కుమార్తె రేఖ చెన్నై అన్నానగర్‌లోని ఓ కాలేజీలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతుంది. ఈ నెల 14న తన పుట్టిన రోజు కావడంతో రేఖా.. కాలేజీకి వెళ్లి స్నేహితులతో గడిపింది.

ఇంటికి వెళ్లగా.. సాయంత్రం పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని తల్లిదండ్రులు భావించారు. ఈ నేపథ్యంలో బ్యూటీ పార్లర్‍కు వెళ్లి వస్తానని చెప్పి స్కూటీ తీసుకుని సెవ్వాపేట రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ బండి పార్క్ చేసి.. పట్టాలు దాటి బ్యూటీ పార్లర్‌కు వెళ్లి సాయంత్రం తిరిగి.. ఇంటికి బయలు దేరింది. సెల్ ఫోనులో మాట్లాడుతూ ట్రాక్ దాడుతుండగా.. చెన్నై నుండి తిరువళ్లూరు వైపు వెళుతున్న రైలు రేఖను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. రైల్వే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పుట్టిన రోజు నాడే కూతురు దూరమవ్వడంతో కన్నీటి పర్యంతం అయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి