iDreamPost

మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ ఆటో! 15 నిమిషాల ఛార్జింగ్! ఇక ఆటో ప్రయాణం చీప్!

మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ ఆటోను తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. మార్కెట్ లోకి అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఆటో అందుబాటులోకి వచ్చింది.

మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ ఆటోను తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. మార్కెట్ లోకి అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఆటో అందుబాటులోకి వచ్చింది.

మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ ఆటో! 15 నిమిషాల ఛార్జింగ్! ఇక ఆటో ప్రయాణం చీప్!

భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాల హవా కొనసాగనున్నది. ఇప్పటికే ఎలక్ట్రిక్ బైక్ లు, స్కూటర్లు, ఆటోలు మార్కెట్ లోకి వచ్చేశాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ సంస్థలు అద్భుతమైన ఫీచర్లతో ఈ-వాహనాలను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా ప్యాసింజర్ ల కోసం ఉపయోగించే ఎలక్ట్రిక్ ఆటోలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగా ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు వాహనదారులు. ఈ క్రమంలో మార్కెట్ లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ ఆటో అందుబాటులోకి వచ్చింది. ఈవీ తయారీదారు ఒమెగా సీకీ మొబిలిటీ (ఓఎస్‌ఎం) దేశీయ మార్కెట్‌లోకి ‘స్ట్రీమ్‌ సిటీ కిక్‌’ పేరుతో ఓ నయా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ త్రీవీలర్‌ను తీసుకొచ్చింది.

ఒమెగాకు చెందిన ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఇటు ప్రయాణికులకు.. అటు డ్రైవర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది. ఈ ఆటో కేవలం 15 నిమిషాల్లోనే ఛార్జింగ్ కావడం దీనిలోని ప్రత్యేకత. అంతే కాదు సింగిల్ ఛార్జ్ తో 126 కి.మీల దూరాన్ని ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్లతో డ్రైవర్లకు భారీగా లాభం చూకూరనున్నది. అంతేకాదు ప్రయాణికులకు కూడా ఆటో ప్రయాణం చీప్ కానున్నది. ఎందుకంటే ప్రస్తుం డీజిల్, సీఎన్జీ ఆటోలల్లో ప్రయాణిస్తే ప్రయాణ ఖర్చులు ఎక్కువ. ఆటో డ్రైవర్లకు ఇంధనం సమకూర్చుకోవడం కూడా ఖర్చుతో కూడుకున్నదే. అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటోతో ఖర్చు తగ్గుతుండడంతో ఛార్జీలు తగ్గే అవకాశం ఉంటుంది.

దీంతో ఆటోలో ప్రయాణించే వారి సంఖ్య కూడా పెరగనున్నది. మన రాష్ట్రంలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్లకు బుకింగ్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ ఎలక్ట్రిక్ ఆటోతో ఖర్చులు తగ్గి డ్రైవర్ల సంపాదన పెరిగే అవకాశం మెండుగా ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. కాబట్టి ఒమెగా ప్రవేశ పెట్టిన ఈ ఎలక్ట్రిక్ ఆటోతో డ్రైవర్లకు, ప్రయాణికులకు ఎంతో లాభదాయకంగా ఉండనున్నది. కాగా, దీని ఎక్స్‌ షోరూం ధర రూ.3,24,999. కొనుగోలుదారులకు 2 లక్షల కిలోమీటర్లు లేదా 5 ఏళ్ల వారంటీ లభిస్తుంది. ఇందులో 8.8 కిలోవాట్స్‌ బ్యాటరీ ఉన్నది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి