iDreamPost

సెమీస్ మ్యాచ్ న్యూజిలాండ్ తోనేనా.. పగ తీర్చుకోవాల్సిందే?

వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ ప్రత్యర్థి దాదాపు ఖారారు అయ్యింది. ఎట్టకేలకు కవీస్ పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కలుగనున్నది. 2019 లో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ లో భారత్ ను న్యూజిలాండ్ ఓడించింది.

వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ ప్రత్యర్థి దాదాపు ఖారారు అయ్యింది. ఎట్టకేలకు కవీస్ పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కలుగనున్నది. 2019 లో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ లో భారత్ ను న్యూజిలాండ్ ఓడించింది.

సెమీస్ మ్యాచ్ న్యూజిలాండ్ తోనేనా.. పగ తీర్చుకోవాల్సిందే?

వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ ప్రత్యర్థి దాదాపు ఖారారు అయ్యింది. గురువారం బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ముందుగా నిర్ణీత 50 ఓవర్లలో 171 పరుగులకే శ్రీలంకను కుప్పకూల్చింది న్యూజిలాండ్. ఆ తర్వాత 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ అలవోకగా ఛేదించింది. కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 23.2 ఓవర్లలోనే విజయం సాధించింది. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై కివీస్ 25 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించి గెలవడంతో కివీస్ సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉన్నాయి. కివీస్ నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుంది. పాకిస్తాన్ సెమీస్ కు వెళ్లాలంటే అద్భుతమే జరగాలి.

ఎందుకంటే తన తర్వాత లీగ్ మ్యాచ్ ఇంగ్లాండ్ పై 274 రన్స్ తేడాతో గెలవాలి. ఒక వేళ ఇంగ్లాండ్ ముందు బ్యాటింగ్ చేస్తే పాకిస్తాన్ 2.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాలి. అలా సాధ్యపడని యెడల పాక్ ఇంటిదారి పట్టాల్సిందే. అప్పుడు భారత్- న్యూజిలాండ్ సెమీస్ లో తలపడే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్- సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ -పాకిస్తాన్ మ్యాచ్ ల ఫలితాల అనంతరం సెమీస్ కు వచ్చే జట్టు ఏదో తేలనుంది. అయితే ఒక వేళ కివీస్ తోనే సెమీఫైనల్ ఆడాల్సి వస్తే భారత్ కు పగ తీర్చుకునే అవకాశం లభించినట్లవుతోంది. 2019 లో జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ లో భారత్ ను న్యూజిలాండ్ ఓడించింది.

ఇంగ్లాండ్ లో జరిగిన సెమీ ఫైనల్ లో 239 పరుగుల చేసింది కివీస్. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ మరుసటి రోజు ఆడాల్సి వచ్చింది. 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఛేదనలో తడబడింది. దీంతో కివీస్ విజయం సాధించింది. అదే విధంగా 2021 వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో మరోసారి టీమిండియాను ఓడించింది కివీస్. కాగా ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో సెమీస్ లో భారత్ ప్రత్యర్థి కివీస్ అని ఖరారు అవుతున్న నేపథ్యంలో 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరికినట్లైతది. ఎక్కడైతే పరాజయం పాలయ్యామో అక్కడే కవీస్ ను ఓడించి విజయ దుందుభి మోగించాల్సిన అవసరం టీమిండియాపై ఉన్నది. ఎట్టకేలకు కవీస్ పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కలుగనున్నది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి