iDreamPost

T20 వరల్డ్ కప్​ టీమ్​ను వెరైటీగా ప్రకటించిన కివీస్.. ఎవ్వరూ ఊహించని విధంగా..!

  • Published Apr 29, 2024 | 4:04 PMUpdated Apr 29, 2024 | 4:04 PM

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్​ పండుగ త్వరలో మొదలవనుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో ఆడబోయే తమ టీమ్​ను న్యూజిలాండ్ ప్రకటించింది. అయితే ఎవ్వరూ ఎక్స్​పెక్ట్ చేయని విధంగా వినూత్నంగా స్క్వాడ్ అనౌన్స్​మెంట్ చేసింది కివీస్.

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్​ పండుగ త్వరలో మొదలవనుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో ఆడబోయే తమ టీమ్​ను న్యూజిలాండ్ ప్రకటించింది. అయితే ఎవ్వరూ ఎక్స్​పెక్ట్ చేయని విధంగా వినూత్నంగా స్క్వాడ్ అనౌన్స్​మెంట్ చేసింది కివీస్.

  • Published Apr 29, 2024 | 4:04 PMUpdated Apr 29, 2024 | 4:04 PM
T20 వరల్డ్ కప్​ టీమ్​ను వెరైటీగా ప్రకటించిన కివీస్.. ఎవ్వరూ ఊహించని విధంగా..!

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్​ సంరంభం త్వరలో మొదలవనుంది. ఇప్పుడు అందరూ ఐపీఎల్​ హడావుడిలో ఉన్నారు. కానీ మెగా లీగ్ ముగిసిన వెంటనే పొట్టి కప్ సందడి షురూ కానుంది. ప్రపంచ కప్ ఆరంభానికి ఇంకా నెల రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో అన్ని దేశాలు టీమ్ సెలెక్షన్ మీద ఫోకస్ పెట్టాయి. రాబోయే వారం రోజుల్లో దాదాపుగా అన్ని కంట్రీస్ తమ స్క్వాడ్స్​ను ప్రకటించనున్నాయి. ఇవాళ న్యూజిలాండ్ తమ వరల్డ్ కప్ టీమ్​ను ప్రకటించింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా వినూత్నంగా జట్టును అనౌన్స్ చేసింది కివీస్.

టీ20 ప్రపంచ కప్​లో పాల్గొనే న్యూజిలాండ్ ఆటగాళ్ల వివరాలను వెరైటీగా ప్రకటించారు. ఇద్దరు చిన్నారులు ప్రెస్ మీట్​లో ఈ డీటెయిల్స్ వెల్లడించారు. టీమ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సారథ్యంలో తమ జట్టు పొట్టి వరల్డ్ కప్ బరిలోకి దిగనుందని ఆంగస్, మటిల్డా అనే ఆ ఇద్దరు చిన్నారులు తెలిపారు. 15 మందితో కూడిన టీమ్​లోని ఒక్కో ప్లేయర్ పేర్లు చెబుతూ ఆఖర్లో మీడియా నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అని ఆ చిన్నారులు అడిగేసిరికి అక్కడ ఉన్న వాళ్లంతా పగలబడి నవ్వారు. సాధారణంగా ప్రపంచ కప్ లాంటి బిగ్ టోర్నమెంట్స్​కు టీమ్ అనౌన్స్​మెంట్ సమయంలో సెలెక్టర్లు, బోర్డు పెద్దలు, టీమ్ మేనేజ్​మెంట్​కు సంబంధించిన వ్యక్తులు పాల్గొంటారు. కానీ కివీస్ మాత్రం ఇందుకు భిన్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అందరి అటెన్షన్​ను తమ వైపునకు తిప్పుకుంది.

వరల్డ్ కప్​లో ఆడబోయే న్యూజిలాండ్ టీమ్​ను అనౌన్స్ చేసిన చిన్నారులు ఆంగస్, మటిల్డా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. వీళ్ల వీడియోను చూసిన నెటిజన్స్ కివీస్ ఐడియా సూపర్బ్ అని, ఎవరూ చేయని విధంగా చాలా డిఫరెంట్​గా జట్టును ప్రకటించారని మెచ్చుకుంటున్నారు. ఇక, బ్లాక్​కాప్స్ స్క్వాడ్ విషయానికొస్తే.. విలియమ్సన్​తో పాటు ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైకేల్ బ్రేస్​వెల్, మార్క్​ చాప్​మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ జట్టులో ఉన్నారు. ఇంజ్యురీస్​తో ఇబ్బంది పడుతున్న పేసర్ కైల్ జెమీసన్, ఆల్​రౌండర్ ఆడమ్ మిల్నే ప్రపంచ కప్​కు దూరమయ్యారు. మరి.. కివీస్ వరల్డ్ కప్ స్క్వాడ్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి