iDreamPost

విజయ్ దేవరకొండపై అసభ్యకర వీడియోలు.. ఆ వ్యక్తి అరెస్ట్

టాలీవుడ్ యంగ్ హీరోల్లో విజయ్ దేవర కొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న హీరో నుండి స్టార్ హోదాకు ఎదిగాడు. ఈ సినీ ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇంతటి స్థాయికి వచ్చిన విజయ్ దేవరకొండపై..

టాలీవుడ్ యంగ్ హీరోల్లో విజయ్ దేవర కొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న హీరో నుండి స్టార్ హోదాకు ఎదిగాడు. ఈ సినీ ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇంతటి స్థాయికి వచ్చిన విజయ్ దేవరకొండపై..

విజయ్ దేవరకొండపై అసభ్యకర వీడియోలు.. ఆ వ్యక్తి అరెస్ట్

టాలీవుడ్ పరిశ్రమలో తన సినిమాలతో అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. రౌడీ బాయ్‌గా ముద్ర పడ్డప్పటికీ.. చాలా కూల్ పర్సన్. అర్జున్ రెడ్డితో అతడి క్రేజ్ ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. బాలీవుడ్ కంట్లో కూడా పడ్డాడు. అక్కడి హీరోయిన్లకు క్రష్ స్టార్‌గా మారాడు. ఈ ఏడాది ఖుషీ అంటూ పలకరించిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీ షూటింగ్‌లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా.. ఎందుకో పండగ రేసు నుండి తప్పుకుంది. అయితే కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు.. విజయ్‌ను కొంత మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ టార్గెట్ చేశారు.

విజయ్ గురించి అసభ్యకర వార్తలు ప్రసారం చేస్తూ శునకానందాన్ని పొందుతున్నారు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో నిందితుడ్ని అరెస్టు చేశారు. అనంతపురానికి చెందిన వెంకట కిరణ్ అనే వ్యక్తి.. సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి.. రౌడీ బాయ్ గురించి తప్పుడు కథనాలతో వీడియో చేయడం మొదలు పెట్టాడు. విజయ్ గురించి అసత్యపు వార్తలను ప్రసారం చేయడమే కాకుండా.. ఆయన సినిమాల్లోని హీరోయిన్లను అవమానిస్తూ చేసిన యూట్యూబ్ వీడియోలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు. దీనిపై దృష్టి సారించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తు చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడ్ని వెంకట కిరణ్ అని గుర్తించి.. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వీడియోలన్నింటినీ ఛానల్ నుండి డిలీట్ చేయించారు. అంతేకాదు భవిష్యత్‌లో ఇలాంటి వీడియోలు చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఎవరైనా వ్యాఖ్యలు చేసినా, మీడియా మాధ్యమాలలో అవమానిస్తున్నట్లు వార్తలు ప్రసారం చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. విజయ్ గురించి ఇలాంటి వీడియోలు చేసిన వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోవడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి