iDreamPost

యంగ్ టైగర్ 30కి రంగం సిద్ధం

యంగ్ టైగర్ 30కి  రంగం సిద్ధం

అరవింద సమేత వీర రాఘవ తర్వాత ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా రెండేళ్లు గ్యాప్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇకపై స్పీడ్ పెంచబోతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 30వ సినిమాకు గ్రౌండ్ రెడీ చేసుకున్నట్టుగా లేటెస్ట్ అప్ డేట్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవాళ సాయంత్రం 5 గంటలకు వెలువడే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ లో తన పార్ట్ షూటింగ్ మే లేదా జూన్ లో పూర్తయిపోతుందట. ఆ తర్వాత ఎక్కువ ఆలస్యం చేయకుండా త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేసారని తెలిసింది. అయితే దీన్ని హారికా హాసిని సోలోగా నిర్మించడం లేదు.

తారక్ అన్న కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి పార్ట్ నర్ షిప్ మీద ప్రొడ్యూస్ చేస్తారు. ఇదే తరహా ఒప్పందం అల వైకుంఠపురములోకి గీతా ఆర్ట్స్ తో చేసుకున్నారు నిర్మాత రాధాకృష్ణ. హీరోయిన్ టెక్నీకల్ టీమ్ తదితర వివరాలు తర్వాత ప్రకటిస్తారు. అరవింద సమేత టైంలోనే త్రివిక్రమ్ తో తనకు మరోసారి కలిసి వర్క్ చేయాలనుందని చెప్పిన తారక్ అనుకున్నట్టుగానే ఆర్ఆర్ఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా దీన్ని లైన్ లోకి తీసుకొచ్చాడు. రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ఉండొచ్చు.

త్వరగా పూర్తయినా లేక ఆలస్యమైనా ఇది ఆర్ఆర్ఆర్ తర్వాతే విడుదలవుతుంది. అంటే 2021 సమ్మర్ కన్నా ముందు వచ్చే ఛాన్స్ లేనట్టే. ఈ లెక్కన వచ్చే ఏడాది యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు రెండు పండుగలు వస్తాయి. అసలే తమ హీరోని తెరమీద చూసుకోక ఏడువందల రోజులు అవుతుందన్న బెంగలో ఉన్న అభిమానులకు ఇలా డబుల్ ట్రీట్ అంటే అంత కంటే కావాల్సింది ఏముంటుంది. టైటిల్ గురించి కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కానీ అన్నింటికీ సాయంత్రం చెక్ పడిపోతుంది. తమన్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి. సో వీరరాఘవరెడ్డిగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో కనిపించిన తారక్ ఈ సారి ఎలా వస్తాడో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి