iDreamPost

హరికృష్ణ మనవడు ఎంట్రీ. .అచ్చం బాబాయ్ జూనియర్ ఎన్టీఆర్‌లా

నందమూరి వంశం నుండి మరో వారసుడు వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దివంగత నటుడు హరికృష్ణ పెద్ద కుమారుడు.. జానకీ రామ్ కుమారుడు హీరోగా రాబోతున్నాడట.

నందమూరి వంశం నుండి మరో వారసుడు వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దివంగత నటుడు హరికృష్ణ పెద్ద కుమారుడు.. జానకీ రామ్ కుమారుడు హీరోగా రాబోతున్నాడట.

హరికృష్ణ మనవడు ఎంట్రీ. .అచ్చం బాబాయ్ జూనియర్ ఎన్టీఆర్‌లా

నందమూరి వంశం నుండి నుండి మరో వారసుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ కన్నా ముందే ఇతడు రాబోతున్నాడని తెలుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించబోతున్నాడు. ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన వైవీఎస్ చౌదరి ఇప్పుడు ఆయన ముని మనవడ్ని హీరోగా పరిచయం చేసే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు. రేయ్ తర్వాత సినిమాలు చేయని వైవీఎస్ చౌదరి.. సుమారు 9 ఏళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టనున్నాడు. ఇంతకు అతడు హీరో చేయబోయే నందమూరి వారసుడు ఎవరు అనుకుంటున్నారా..? హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ కుమారుడు ‘తారక రామారావు’ను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది.

జానకీరామ్ 2014లో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి విదితమే. ఆయనకు ఇద్దరు కుమారులు. .ఎన్టీఆర్, సౌమిత్ర. వీరికి కూడా నటనపై ఆసక్తి ఉంది. వీరిలో పెద్ద కుమారుడు ఎన్టీఆర్ ను ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట వైవీఎస్ చౌదరి. గతంలో అనేక పౌరాణిక నాటకాలు వేసిన అనుభవం ఈ చిన్నోడికి ఉంది. దానవీర శూర కర్ణ అనే పిల్లల రూపొందించిన పౌరాణిక చిత్రంలో కృష్ణుడి పాత్రల ఎన్టీఆర్.. సోదరుడు సౌమిత్ర సహదేవుడి పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు తారక రామారావును హీరోగా పరిచయం చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది. బాబాయ్ తారక్ సపోర్టుతో త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఇక ఈ సినిమా తెలుగు సంస్కృతి, సంగీతం, సాహిత్యంతో కూడిన కథాంశంతో పాటు చక్కటి ప్రేమ కథగా తెరకెక్కనుందని తెలుస్తోంది. అతడు హీరోగా ఎంట్రీ అయితే.. అటు ఇద్దరు బాబాయిలు తారక్ , కళ్యాణ్ రామ్ మద్దుతుకే కాదు ఫ్యాన్స్ సపోర్టు కూడా బలంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Jr NTR brother son

బాబాయ్ జూనియర్ ఎన్టీఆర్‌లాగే చిన్నప్పుడు సినిమాల్లో చేసి.. ఇప్పుడు చిన్న వయస్సులోనే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.  పౌరాణికాల్లో వేసిన అనుభవం, డైలాగ్ డెలివరీ, ముఖ వర్చుస్సు కూడా అతడికి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక వైవీఎస్ చౌదరి విషయానికి వస్తే.. శ్రీ సీతారాముల కళ్యాణం చూతం రారండి వంటి యూత్ లవ్ స్టోరీ సబ్జెక్ట్‌ను కుటుంబానికి ముడిపెట్టి తెరకెక్కించడంతో తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడీ దర్శకుడు. సీతారామ రాజు, యువరాజు సినిమాలకు అంత ఆదరణ లభించకపోయినా.. హరికృష్ణ నటించిన లాహిరీ లాహిరీ లాహిరీ, సీతయ్యలో వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. దేవదాసు, ఒక్క మగాడు, సలీమ్ వంటి చిత్రాలు తెరకెక్కించాడు. సాయి ధరమ్ తేజ్‌ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈ దర్శకుడే. రేయ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు ఈ మెగా వారసుడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి