iDreamPost

Ayodhya: ఇకపై ఆన్ లైన్ లో రామమందిర దర్శన పాస్‌ల బుకింగ్ మరింత సులభం

  • Published Jan 24, 2024 | 11:26 AMUpdated Jan 24, 2024 | 11:26 AM

అయోధ్య కొలువుతీరిన బాల రాముడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో అందరి ప్రశ్న ఒకటే ఆ బాల రాముడిని దర్శించుకోవడానికి పాస్ లు ఎలా బుక్ చేసుకోవాలి అని. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అయోధ్య కొలువుతీరిన బాల రాముడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో అందరి ప్రశ్న ఒకటే ఆ బాల రాముడిని దర్శించుకోవడానికి పాస్ లు ఎలా బుక్ చేసుకోవాలి అని. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jan 24, 2024 | 11:26 AMUpdated Jan 24, 2024 | 11:26 AM
Ayodhya: ఇకపై ఆన్ లైన్ లో రామమందిర దర్శన పాస్‌ల బుకింగ్ మరింత సులభం

ఎట్టకేలకు రామ జన్మ భూమికి బాల రాముడు తిరిగి వచ్చేశాడు. అంగరంగ వైభవంగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు పూర్తి అయిపోయాయి. ఈ హడావిడి పూర్తయ్యి రెండు రోజులు గడిచినా.. ఇంకా అందరిలో అదే ఉత్సాహం ఆనందం కనిపిస్తున్నాయి. కొన్ని తరాల పాటు ఈ సందడి కొనసాగుతూనే ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయోధ్యలో కొలువు తీరిన ఆ బలరాముడికి “బాలక్ రామ్” అని నామకరణం కూడా చేశారు. ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి వెళ్లలేని భక్తులు వారి ఇళ్ల వద్ద నుంచే ఈ మహత్తర కార్యక్రమాన్ని వీక్షించారు. ఇక ఇప్పుడు అందరి కోరిక ఒక్కటే వారి జీవిత ప్రయాణంలో ఒక్కసారైనా.. అయోధ్య కొలువుతీరిన ఆ బాల రాముడిని దర్శించాలని. ఇప్పుడు అందరి ప్రశ్న ఒక్కటే అయోధ్య బాల రాముడిని దర్శించుకోవడం ఎలా ! అనే అందరు ఇంటర్ నెట్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. కాబట్టి శ్రీ రాముడిని దర్శించుకోవాలంటే టిక్కెట్లు ఎలా బుక్‌ చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పటికే అయోధ్య రాముడిని దర్శించుకోవడం కోసం.. బస్సులు, రైళ్ల సదుపాయాలను కల్పిస్తున్నారు. దీని గురించి వార్తల్లో వస్తూనే ఉంది. కానీ అయోధ్యకు చేరుకున్న తర్వాత రాముడి దర్శనానికి టికెట్స్ ఎలా కొనుగోలు చేయాలి అనేది అందరికి ప్రశ్నగా మారింది. వారి అందరికోసం.. ఆన్ లైన్ లోనే ఈ పాస్ లను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధికారిక వెబ్‌సైట్‌ను అన్వేషించాలి. అందులో దర్శనం కోసం స్లాట్‌ను బుక్ చేసుకోవడానికి.. ‘నా ప్రొఫైల్’ విభాగాన్ని యాక్సెస్ చేయాలి. మీరు ఏ రోజైతే దర్శించుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీని, నిర్దిష్ట సమయాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందుకోసం అవసరమైన పూర్తి వివరాలను, ఆధారాలను అందచేయాలి. “హారతి” వేడుకకు హాజరయ్యే ముందు .. ఆలయ ప్రదేశంలో నియమించిన కౌంటర్ నుంచి మీ పాస్ ను తీసుకోవాలి. భక్తులకు లభించే స్లాట్స్ ను బట్టి ఆన్ లైన్ లో అదే రోజున బుకింగ్స్ చేసుకోవచ్చు. వారికీ చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్ ను చూపించి.. హారతికి సుమారు 30 నిమిషాల ముందు ఆలయ పప్రాంగణంలో ఉండేలా భక్తులు ప్లాన్ చేసుకోవాలి. ఈ రకంగా భక్తులు అయోధ్యలో కొలువుతీరిన బాల రాముడిని దర్శించుకోవచ్చు.

ఇక అయోధ్య మహానగరంలో ప్రతిష్టాపన జరిగిన రోజు .. దేశ నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖులు, సెలెబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఆ తరువాత రోజు నుంచి సాధారణ భక్తులు పోటెత్తారు. రెండవ రోజు దాదాపు 5 లక్షల మంది జన సందోహంతో.. అయోధ్య బాల రాముని మందిరం కిక్కిరిసిపోయినట్టు సమాచారం. రానున్న రోజుల్లో అయోధ్య మహా పుణ్య క్షేత్రంగా మారనుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి, అయోధ్య బాల రాముని దర్శించుకునేందుకు..పాస్ లు ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి