iDreamPost

రూ.20 వేలలోపే నథింగ్ ఫోన్.. కొనచ్చా- లేదా?

Nothing Phone 2A Review: నథింగ్ కంపెనీకి మంచి క్రేజే ఉంది. కానీ, ధర మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది అని ఆగుతారు. కానీ, ఇప్పుడు బడ్జెట్ రేంజ్ లోనే నథింగ్ ఫోన్ లాంఛ్ అయ్యింది. మరి.. దాని ఫీచర్స్ ఏంటి? కొనచ్చా లేదా? చూడండి.

Nothing Phone 2A Review: నథింగ్ కంపెనీకి మంచి క్రేజే ఉంది. కానీ, ధర మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుంది అని ఆగుతారు. కానీ, ఇప్పుడు బడ్జెట్ రేంజ్ లోనే నథింగ్ ఫోన్ లాంఛ్ అయ్యింది. మరి.. దాని ఫీచర్స్ ఏంటి? కొనచ్చా లేదా? చూడండి.

రూ.20 వేలలోపే నథింగ్ ఫోన్.. కొనచ్చా- లేదా?

ఇప్పుడు మార్కెట్ లోకి లెక్కలేనన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఒక్కో ఫోన్లో ఒక ప్రత్యేకత ఉటుంది. దాన్ని బట్టి మీ అవసరం ఏదో దానికి తగిన ఫోన్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. కానీ, కొన్నిసార్లు మార్కెట్ లోకి అన్ని అవసరాలకు అనుగుణంగా కొన్ని ఫోన్లు వస్తూ ఉంటాయి. అవి కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక స్మార్ట్ ఫోన్ అయితే మార్కెట్ లోకి వచ్చేసింది. అది కూడా వెరీ క్రేజీ నథింగ్ కంపెనీ నుంచి. గతంలో నథింగ్ ఫోన్ అంటే కాస్త కాస్ట్లీ గురూ అనేవాళ్లు. ఇప్పుడు ఈ కంపెనీ కూడా బడ్జెట్ రేంజ్ లోకి వచ్చేసింది. మరి.. ఆ బడ్జెట్ ఫోన్ ఎలా ఉంది? దానిని ఆ కాస్టులో కొనుగోలు చేయడం కరెక్టేనా? చూద్దాం.

ఈ నథింగ్ ఫోన్ 2ఏ రెండు వేరియంట్స్ లో రాబోతోంది. ఒకటి 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర రూ.23,999గా ఉంది. దీని తర్వాత 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఈ వేరియంట్ ధర రూ.27,999గా ఉంది. ఇంక ఈ నథింగ్ ఫోన్ పై HDFC డెబిట్/ క్రెడిట్ కార్డుతో పర్చేస్ చేస్తే అదనంగా రూ.2 వేలు ధర తగ్గుతుంది. అలాగే మీరు మీ పాత ఫోన్ ని ఎక్స్ ఛేంజ్ చేస్తే రూ.2 వేలు ఎక్స్ ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఇలా ఈ నథింగ్ ఫోన్ 2ఏ మోడల్ ధర రూ.19,999కు లభిస్తుంది. ఎలాంటి ఆఫర్స్ లేకపోతే మాత్రం ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ వర్షన్ రూ.23,999కు కొనుగోలు చేయచ్చు. మరి.. అంత ధరకు కొనచ్చా అంటే.. దాని ఫీచర్స్ చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది.

Nothing phonr 2a for 20 thousand

ఈ నథింగ్ ఫోన్ లుక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇది ఎప్పటిలాగానే ట్రాన్స్ పరెంట్ బ్యాక్ లుక్స్ తో వస్తోంది. అలాగే కెమెరాలు బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఇవి చూడటానికి అచ్చం మనిషి కళ్లలాగానే ఉంటాయి. అలాగే గ్లిఫ్ ఇంటర్ ఫేస్ లో కాస్త ఛేంజ్ చేశారు. ఈసారి కేవలం కెమెరా చుట్టూ మాత్రమే ఎల్ఈడీ లైట్స్ వస్తాయి. ఇంక గ్లిఫ్ ఇంటర్ ఫేస్ ని చాలా విధాలుగా వాడుకోవచ్చు. బాగా అట్రాక్ట్ చేసే అంశం ఏంటంటే.. మీరు ఆన్ లైన్ లో ఆర్డర్ పెడితే.. ఆ డెలివరీ బాయ్ ఎక్కడి వరకు వచ్చాడో కూడా ఈ లైట్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్  మంచి లౌడ్ వాయిస్ ని అందిస్తాయి. అలాగే ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తోంది. ఓవరాల్ గా లుక్స్ మాత్రం అదిరిపోయాయి. పైగా ఫోన్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది.

ఇంక ఈ నథింగ్ ఫోన్ 2ఏ ఫీచర్స్ విషయానికి వస్తే.. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లేతో వస్తోంది. ఇది 1300 నిట్స్ బ్రైట్ నెస్, 120 హెట్స్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. పైగా ఈ నథింగ్ ఫోన్ 2ఏ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తోంది. అంటే మీకు ట్యాంపర్డ్ గ్లాసుల జంజాటం తప్పిపోయింది అనచ్చు. ఇది మీడియాటక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్ తో వస్తోంది. ఆండ్రాయిడ్ 14, నథింగ్ ఓఎస్ 2.5తో దీనిని తీసుకొస్తున్నారు. 3 ఏళ్లు ఓఎస్ అప్ డేట్స్.. 4 ఏళ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ ఇవ్వనున్నారు. ఈ ప్రాసెసర్, నథింగ్ యూఐతో ఈ ఫోన్ ఎంతో సూపర్ స్మూత్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మీరు దీనిని వాడుతున్నప్పుడు స్మూత్ ఇంటర్ ఫేస్ యాక్షన్స్ చూస్తే ఐఫోన్ ఫీల్ ఉంటుంది.

Nothing phonr 2a for 20 thousand

పర్ఫార్మెన్స్ విషయంలో గేమింగ్ ప్రియులకు కాస్త నిరాశ తప్పదు అంటున్నారు. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్ ఓన్లీ గేమింగ్ ఫోన్స్ కొన్ని ఉంటాయి. అవి అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. ఇది ఓవరాల్ గా అన్నీ అవసరాల కోసం కాబట్టి కాస్త గేమింగ్ ఎక్స్ పీరియన్స్ తగ్గచ్చు. ఇంక కెమెరాలు చూస్తే.. 50 ఎంపీ + 50 ఎంపీ కెమెరాలను అందించారు. ఇవి ఫొటోలను బాగానే తీస్తున్నాయి. అయితే వీడియో విషయంలో మాత్రం కాస్త నిరాశ తప్పదు. ఇంక ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. అయితే వీళ్లు బాక్స్ లో కేబుల్ ఇస్తారు ఛార్జర్ మీరే తీసుకోవాలి. ఓవరాల్ గా ఈ నథింగ్ ఫోన్ ఈ ప్రైస్ రేంజ్ లో మంచి లుక్స్, మంచి పర్ఫార్మెన్స్, మంచి కెమెరాతో వస్తోంది. కాబట్టి ఈ నథింగ్ ఫోన్ 2ఏ అయితే వదిలేయాల్సిన డీల్ అయితేకాదు. త్వరలోనే ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో సేల్ కి రాబోతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి