iDreamPost

BharatGPT:ఇండియా మరో అద్భుతం: చాట్‌ జీపీటీకి పోటీగా.. జియో భారత్‌ జీపీటీ!

  • Published Jan 02, 2024 | 2:13 PMUpdated Jan 02, 2024 | 4:20 PM

మరో కొత్త టెక్నాలజీ ఆవిష్కరణకు జియో టెలికాం సంస్థ శ్రీకారం చుట్టబోతుంది. అందుకోసం ప్రముఖ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సంస్థల చైర్మన్ ఆకాష్ అంబానీ తాజగా కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే..

మరో కొత్త టెక్నాలజీ ఆవిష్కరణకు జియో టెలికాం సంస్థ శ్రీకారం చుట్టబోతుంది. అందుకోసం ప్రముఖ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సంస్థల చైర్మన్ ఆకాష్ అంబానీ తాజగా కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే..

  • Published Jan 02, 2024 | 2:13 PMUpdated Jan 02, 2024 | 4:20 PM
BharatGPT:ఇండియా మరో అద్భుతం: చాట్‌ జీపీటీకి పోటీగా.. జియో భారత్‌ జీపీటీ!

ప్రస్తుతం దేశంలో టెక్నాలజీ డెవలప్ మెంట్ అనేది మరింత అభివృద్ధి చెందింది. నేడు అంత పోటి ప్రపంచం కావడంతో అందరూ లేటేస్ట్ టెక్నాలజీనే ఫాలో అవుతున్నారు. అందులో ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనేది ప్రపంచాన్ని శాసిస్తోంది. కాగా, ఇది సరికొత్త ఆవిష్కరణతో చాట్ జీపీటీ (జనరేటివ్ ప్రీ-ట్రైనింగ్ ట్రాన్స్‌ఫార్మర్) అనే టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బడా టెక్ కంపెనీలు ఈ రంగంలోకి అడుగు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే టాప్ సంస్థలు అయినటు వంటి గూగుల్, మైక్రోసాఫ్ట్ మొదలైన దిగ్గజ సంస్థలన్నీ చాట్ జీపీటీ పై పెట్టుబడులు పెట్టి వాటి సేవలను అందిస్తున్నాయి. అయితే తాజాగా ఈ రంగంలోకి దేశీయ టెలికాం సంస్థ జియో కూడా అడుగుపెట్టబోతుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రముఖ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సంస్థల చైర్మన్ ఆకాష్ అంబానీ తాజగా కీలక ప్రకటన చేశారు. దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ అయినటు వంటి జియో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి అడుగుపెడుతోందని ఆయన తెలిపారు. కాగా, గత ఏడాది డిసెంబర్ 27వ తేదిన (ఐఐటి) ముంబైలో  ప్రారంభమైన సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్ టెక్ ఫెస్ట్‌లో ఆకాష్ అంబానీ పాల్గొన్నారు.

ఇందులో భాగంగానే ఆకాష్ మాట్టాడుతూ.. ‘జియో, ఐఐటీ ముంబైతో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్‌ను ప్రారంభించేందుకు కృషి చేస్తోందని, అందుకు దానికి ‘భారత్ జిపిటి’ అని పేరు పెట్టినట్లు ఆకాష్‌ అధికారికంగా ప్రకటించారు. అలాగే టీవీలకు ఆపరేటింగ్ సిస్టమ్‌ను లాంచ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.ఇక కంపెనీకి ఎకో సిస్టమ్‌ డెవలప్‌మెంట్‌ ఎంతో ముఖ్యమని, అలాగే జియో 2.0పై ఇప్పటికే పనులు ప్రారంభింామని ఆకాశ్ పేర్కొన్నారు. అలాగే వచ్చే దశాబ్దం నాటికి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జెనరేటివ్ ఏఐ నిర్వచిస్తాయని తెలిపారు. మీడియా స్పేస్, కామర్స్, కమ్యూనికేషన్ల రంగంలోనూ ఉత్పత్తులు, సర్వీసులను ఆవిష్కరిస్తామన్నారు.’

అలాగే రిలయన్స్ తో ఐఐటీ ముంబై 2014 నుంచి వివిధ కార్యక్రమాల రూపకల్పనల్లో భాగస్వామిగా ఉంది. కాగా, కృత్రిమ మేధ విస్తృత సామర్థ్యం సహకారంతో సృజనాత్మకత, వైవిధ్య పూరిత ఉత్పత్తులు, సేవలను అందించడంలో ఈ రెండు ప్రధాన లక్ష్యంగా కలసి పని చేస్తున్నాయి. ఇక ఇంజనీరింగ్ విభాగం రిలయన్స్ జియో సహకారంతో.. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ , ఐఐటీ ముంబాయిలోని కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, GPT సొల్యూషన్స్‌పై అన్ని రంగాల కోసం భారత్ జీపీటీని అభివృద్ధి చేయడానికి పరిశోధనలు చేస్తోంది. మరి, జియో జీపీటీ రంగంలో అడుగుపెట్టడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి