iDreamPost

Allari Naresh: అల్లరి కాదు.. ఆల్ ఇన్ ఆల్ నరేష్

అల్లరి నరేశ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అయితే ఆయన్ని ఇంకా అల్లరి నరేశ్ గానే చూస్తే తప్పే అవుతుందేమో?

అల్లరి నరేశ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అయితే ఆయన్ని ఇంకా అల్లరి నరేశ్ గానే చూస్తే తప్పే అవుతుందేమో?

Allari Naresh: అల్లరి కాదు.. ఆల్ ఇన్ ఆల్ నరేష్

ఎవరి కెరీర్ ఎలాంటి టర్నులు, ట్విస్టులు తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా అదీ సినిమా ప్రపంచంలోనైతే ఇది మరీ విడ్డూరంగా ఉంటుంది. ఒక్క సినిమా, ఒక్క రోల్, ఒక్క హిట్.. రాత్రికి రాత్రి నటీనటుల జీవితాలను అవలీలగా, అమాంతంగా మార్చేస్తాయి. ఈ పాయంట్ ముఖ్యంగా అల్లరి నరేష్ విషయంలోనైతే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అల్లరి సినిమాతో తెరంగేట్రం చేసిన నరేష్ ఆ పేరుతోనే కెరీర్లో సెటిల్ అయిపోయాడు. కామెడీ సినిమాలు చిందర వందరగా చేసి ప్రేక్షకలోకంలో నాటుకుపోయాడు. ఏ నిర్మాతకి ఏ నష్టం రాకుండా సాగిన కెరీర్ తో నరేష్ విజయ ఢంకా మోగించాడు. నరేష్ ఫాదర్ ఈవీవీ సత్యనారాయణ మహాదర్శకుడిగా పేరు తెచ్చుకుని.. ఈవీవీ సత్యనారాయణ సినిమాలని ఓ రికార్డు క్రియేట్ చేశాడు. ఆయన రికార్డుకి ఏ మాత్రం ఢోకా లేకుండానే నరేష్ తన నటజీవితాన్ని పండించుకోవడమే విశేషం.

అలాగని నరేష్ కామెడీ వేషాలకే పరిమితమై పోకుండా మహర్షి, నాంది, ఉగ్రం వంటి సినిమాలతో నరేష్ ఏ వేషమైనా చేయగలడు, ఎటువంటి ఎమోషన్ అయినా పలికించగలడు అనే పాపులారిటీని సొంతం చేసుకుని అందరినీ స్టన్ చేసేశాడు. ఓ మంచి క్యారెక్టర్ ఉంటే గనక ఇది నరేష్ చేస్తే బాగుంటుందనే ఇమేజ్ అండ్ ఫాలోయింగుని తెచ్చుకున్నాడు. ఇది నిజంగా ఓ అరుదైన మైలురాయి. కామెడీ వేషాలు వేసిన వాళ్ళని సీరియస్ రోల్స్ లో గానీ, ఎమోషనల్ రోల్స్ లో గానీ, ప్రేక్షకులు అంగీకరించరు. అసలు ముందు పరిశ్రమలోని డైరెక్టర్లే అవకాశాలివ్వరు. ఒక బ్రాండ్ కి అలవాటు పడితే ఇంక జీవితమంతా అదే పట్టుకుని ప్రాకులాడాలి. కానీ నరేష్ దాన్ని రివర్స్ చేసి పారేశాడు.

లేటెస్ట్ గా మొన్నీ మధ్యనే సంక్రాంతి సందర్భంగా విడుదలైన నా సామిరంగా సినిమాలో అక్కినేని నాగార్జునకి చిన్ననాటి స్నేహితుడిగా చేసి సినిమా విజయానికి ప్రధానమైన కారణంగా నిలబడ్డాడు. కామెడీలా కనిపిస్తూనే, ‘’లేకపోతే మాటొచ్చెస్తది’’ అనే ఊతపదంతో అద్భుతంగా చేసి మెప్పించి, సడన్ గా సీరియస్ యాక్షన్ డ్రామాలోకి టర్న్ అయి, టూ హెవీ ఎమోషన్లో పెద్ద ఫైట్లో ప్రాణాలు పోగొట్టుకునే అంజిగాడి పాత్రకు ప్రాణం పోశాడు. నా సామిరంగాలో నరేష్ క్యారెక్టర్ బాగా పండడం సినిమాకి ఎంతో హెల్ప్ అయిందో చూసిన వాళ్ళంతా చెబుతున్నారు. అటూ ఇటూ ఛెడామడా క్యారెక్టర్లు చేయగలిగే సత్తా ఉన్న నరేష్ కి ఇంకా ఆ ఆల్లరి అనే టైటిల్ అంత యాప్ట్ కాదేమో. ఆలిన్ ఆల్ నరేష్ కరెక్టేమో మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి