iDreamPost

Noida: నిట్టనిలువునా కూలిన ట్విన్ టవర్స్, కన్నీళ్ళతో కంగ్రాట్స్ చెప్పుకున్న ఇంజనీర్లు

Noida: నిట్టనిలువునా కూలిన ట్విన్ టవర్స్, కన్నీళ్ళతో కంగ్రాట్స్ చెప్పుకున్న ఇంజనీర్లు

ఈ ఆదివారం మన దేశ చరిత్రలోనే అతి పెద్ద నియంత్రిత విస్ఫోటనం జరిగింది. యూపీ, ఢిల్లీ సరిహద్దుల్లోని నోయిడాలో చట్టవిరుద్ధంగా నిర్మించిన సూపర్ టెక్ ట్విన్ టవర్స్ (Super) నిట్టనిలువునా కూలిపోయింది. ఇందుకు పట్టిన కాలం 9-10 సెకండ్లు మాత్రమే! కుతుబ్ మినార్ కంటే ఎత్తున్న ఈ టవర్స్ హైట్ వంద మీటర్లు. దీర్ఘకాల విచారణ తర్వాత సుప్రీం కోర్టు ఈ బిల్డింగ్ నిర్మాణంలో చాలా అవకతవకలు జరిగాయని, భద్రతా ప్రమాణాలు అస్సలు పాటించలేదని కిందటేడాది తేల్చింది. దీన్ని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎడిఫైస్ ఇంజనీరింగ్ కంపెనీ (Edifice Engineering Company) అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకుని కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. “వాటర్ ఫాల్ టెక్నిక్” (waterfall technique) ద్వారా టవర్స్ నిలువుగా కూలిపోయేలా ఎడిఫైస్ ఇంజనీర్లు ప్లాన్ చేశారు. ఇందుకోసం 3 వేల 700 కేజీల విస్ఫోటక పదార్థాలు ఉపయోగించారు. కూల్చివేతకు ముందే చుట్టుపక్కల నివసిస్తున్న వేలాది మందిని, వీధి కుక్కలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత సైరన్ మోగించారు. ఆ టైంలో టీమ్ లో ఎవ్వరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇంత పెద్ద కట్టడం ఎలా కూలుతుందోనని అందరిలోనూ టెన్షన్. చివరికి టీమ్ లీడ్ చేతన్ దత్తా బ్లాస్ట్ బటన్ నొక్కారు. పెద్ద శబ్దం. కళ్ళు మూసి తెరిచేలోపే బూడిద కుప్ప మిగిలింది. అంతా అనుకున్నట్లే జరిగిందని అర్థమవగానే టీమ్ మెంబర్స్ ఒకరినొకరు కౌగిలించుకుని ఏడ్చేశారు. ఆ తర్వాత బ్లాస్ట్ సైట్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఒక కాంపౌండ్ వాల్ కి పడిన నెర్రె తప్ప ఎక్కడా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. మొత్తానికి సూపర్ టెక్ ట్విన్ టవర్స్ కథ ఇలా సక్సెస్ ఫుల్ గా ముగిసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి