iDreamPost

Valimai Telugu : ఈ మాత్రం దానికి డబ్బింగ్ చేయడం ఎందుకు

Valimai Telugu : ఈ మాత్రం దానికి డబ్బింగ్ చేయడం ఎందుకు

ఒకప్పుడు ఏదైనా ఇతర బాష సినిమాని తెలుగులో డబ్ చేస్తున్నప్పుడు దాని టైటిల్ ని మనవాళ్ళకు అనుగుణంగా అర్థమయ్యేలా పెట్టేవాళ్ళు. ఒకవేళ సాధ్యం కాకపోతే ఇంగ్లీష్ లో పెట్టేవాళ్ళు తప్ప మరీ తమిళం మలయాళంలో ఉన్నవి యధాతథంగా ఉంచేసిన సందర్భాలు లేవు. కానీ ఈ మధ్యకాలంలో ఆ మాత్రం పెట్టే ఓపిక లేకనో లేదా తెలుగే కదా ఎలా ఉన్నా ఆడియన్స్ చూస్తారని ధైర్యమో తెలియదు కానీ ఇప్పుడో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. సదరు భాషలో పదానికి మనకు అర్థం తెలియకపోయినా సరే దాన్నే టైటిల్ గా పెట్టి వాటిని ఆడియన్స్ మైండ్ లో రిజిస్టర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి ఉద్దేశపూర్వకమే.

ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం వలిమై. అజిత్ హీరోగా వినోత్ దర్శకత్వంలో రూపొందిన వలిమైకి ముందు తెలుగులో బలం అని పేరు పెట్టి మళ్ళీ నిన్నటి నుంచి ఒరిజినల్ టైటిల్ నే తెలుగు ఫాంట్ తో కొత్త పోస్టర్లు వదిలారు. సహజంగానే ఇది భాషాభిమానులకు కోపం తెప్పించింది. గతంలో కంగనా రౌనత్ తలైవి విషయంలో కూడా ఇలాగే చేశారు. జయలలితను తమిళ ప్రజలు మాత్రమే ఆ పేరుతో పిలుచుకుంటారు. ఆ పదానికి అర్థం అమ్మ. కానీ ఇక్కడ మాత్రం తలైవి ని యధాతథంగా అలాగే పెట్టేశారు. దుల్కర్ సల్మాన్ కురుప్ లో అది హీరో పాత్ర పేరు కాబట్టి సరేనని సర్దిచెప్పుకోవచ్చు. కానీ పై రెండు అలా కాదే.

కారణం ఏదైనా ఇది మాత్రం కరెక్ట్ కాదు. తెలుగుకు అనుగుణంగా పేరు ఉండాల్సిందే. గతంలో రజనీకాంత్ కుసేలన్ కి ఇక్కడ కథానాయకుడు అని పెట్టారు. ఎంతిరన్ అని ఉంటే మనకు రోబో అన్నారు. ఇలా అయినా పర్లేదు. కనీసం మీనింగ్ అయినా తెలుస్తుంది. కానీ ఏకంగా వలిమై, తలైవిని పెట్టుకోవడమే ఆక్షేపణీయం. సింగం కేసులోనూ ఇలాగే జరిగింది. ఆడవాళ్లకు మాత్రమే, తూర్పు సిందూరం, ప్రేమికుల రోజు, ప్రేమలేఖ ఇవన్నీ స్వచ్ఛమైన తెలుగు టైటిల్స్ పెట్టుకున్న డబ్బింగ్ సినిమాలు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా చేశారు. ఇంతకీ ఈ వలిమై 13న రావడం అనుమానమేనని చెన్నై మీడియా టాక్. ఇవాళో రేపో క్లారిటీ రానుంది

Also Read : Radhe Shyam Postponed : ప్రభాస్ సినిమా మీద ఓమిక్రాన్ పంజా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి