iDreamPost

హైదరాబాద్ లో ఉగ్రవాదిని అరెస్టు చేసిన NIA!

హైదరాబాద్ లో ఉగ్రవాదిని అరెస్టు చేసిన NIA!

హైదరాబాదు లో మరో ఉగ్రవాదిని అరెస్టు చేశారనే వార్తతో నగరం ఒక్కసారి ఉలిక్కి పడింది. గతంలో మధ్రప్రదేశ్- తెలంగాణ పోలీసులు జరిపిన సోదాల్లో హైదరాబాద్ నగరంలో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అందజేశారు. ఆ తర్వాత ఎన్ఐఏ ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పుడు అదే బృందానికి చెందిన మరో ఉగ్రవాదిని అరెస్టు చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.

HUT అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న ఆరుగురు ఉగ్రవాదులను గతంలో హైదరాబాద్ లోనే అరెస్టు చేశారు. ఇప్పుడు అదే సంస్థకు చెందిన.. ఆ బృందంతో సంబంధాలు ఉన్న మరో ఉగ్రవాదిని ఎన్ఐఏ మంగళవారం అరెస్టు చేసింది. మధ్యప్రదేశ్- తెలంగాణ మాడ్యూల్ కు సంబంధించి ఇప్పుడు అరెస్టు అయిన ఉగ్రవాదుల సంఖ్య 17కు చేరింది. మే 24న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. దాదాపు రెండు నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాలు అందించిన సమాచారంతో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు భోపాల్ లో ఉగ్రవాదులను అరెస్టు చేశారు.  వారిలో ప్రధాన సూత్రధారిని పోలీసులు విచారించారు. అతను ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లో కూడా HUT ఉగ్రవాదులు ఉన్న విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు. తెలంగాణ కౌంటర్ ఇంటిలిజెన్స్ సిబ్బందితో కలిసి ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

తాజాగా ఎన్ఐఏ మరో ఉగ్రవాదిని అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ లో సల్మాన్ అనే ఉగ్రవాదికి చెందిన రెండు ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. HUT ద్వారా సల్మాన్ రిక్రూట్ మెంట్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎలక్ట్రానిక్ డివైజ్ లతో పాటుగా.. పలు కీలక పత్రాలను కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.సల్మాన్ అరెస్టుపై అధికారులు స్పందించారు. సల్మాన్ హెచ్యూటీకి చెందిన యాక్టివ్ పర్సన్ అని చెప్పారు. ఇతను ఇప్పటికే అరెస్టు అయిన సలీం ఆదేశానుసారం పనిచేసేవాడని వెల్లడించారు. వీళ్లు హెచ్యూటీని హైదరాబాద్ లో విస్తరించేందుకు పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. షారియా లాని భారతదేశంలోకి తీసుకొచ్చేందుకు ఒక నెట్ వర్క్ లాగా ఈ సంస్థ పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. మే 24న రిజిస్టర్ అయిన ఈ కేసులో ఎన్ఐఏ దర్యాప్తును కొనసాగిస్తోంది. మొత్తం ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే వరకు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందని చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి