iDreamPost
android-app
ios-app

Kuppam Result : కుప్పంలో దూసుకెళుతున్న వైసీపీ

Kuppam Result : కుప్పంలో దూసుకెళుతున్న వైసీపీ

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన కుప్పం మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో వైసీపీ ఆధిక్యంలో దూసుకెళుతోంది. 1, 2, 7, 9 సహా మొత్తం 10 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లు సమాచారం. మరో గంటలో మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక వార్డును వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న విషయం తెలిసిందే. మొత్తం 25 వార్డులకు గాను ఏకగ్రీవమైన వార్డు మినహా 24 వార్డులకు ఎన్నికలు జరిగాయి.

24 వార్డులను రెండు విడతలుగా లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలో 14 వార్డుల ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో 10 వార్డుల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా నాలుగు వార్డుల్లో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నెల 15వ తేదీన జరిగిన పోలింగ్‌లో 24 వార్డుల్లో 76.84 శాతం మేర పోలింగ్‌ నమోదైంది.

Also Read : Chandrababu,Kuppam- కుప్పం చంద్రబాబు చేజారిపోయినట్టేనా!?

Jojobet GirişBetcioivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetlunabetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis Giriş