iDreamPost
android-app
ios-app

గగనంలో ప్రయాణం మొదలైన రోజు.

గగనంలో ప్రయాణం మొదలైన రోజు.

మానవుడికి మొదటినుంచి పక్షుల్లాగా ఆకాశంలో ఎగరాలన్న కోరిక పుష్పక విమానాల రూపంలో, రెక్కలు అతికించుకుని ఎగిరినట్టు పురాణాలలో,కథల్లో వ్యక్తమవుతూ వచ్చినా, ఆ స్వప్నం నిజమవడానికి మొదటి అడుగు డిసెంబరు 17,1903న రైట్ సోదరులద్వారా పడింది.

ఆసక్తి కలిగించిన బొమ్మ

అమెరికాలోని ఓహయో రాష్ట్రానికి చెందిన ఆర్విల్ రైట్, విల్బర్ రైట్ సోదరులకి ఆకాశంలో ప్రయాణం మీద ఆసక్తి పుట్టించింది వారి బాల్యంలో వారి తండ్రి ఇచ్చిన ఒక బహుమతి అని వారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బెండు, వెదురుబొంగులతో తయారయి, రబ్బరు బ్యాండుతో గాలిలోకి విసిరే ఆ బొమ్మ కింద పడకుండా కాసేపు గాలిలో ఎగరడం చూసిన వారికి గాలిలో ఎగిరే వస్తువుల మీద ఆసక్తి కలిగింది

హైస్కూల్ తర్వాత చదువు మానేసినా రైట్ సోదరులకు మెకానికల్ పరిఙానం బాగా అబ్బింది. దానితో ప్రింటింగ్ ప్రెస్ పెట్టి కొద్దిరోజులు రెండు పత్రికలు కూడా నడిపారు. ఆ తరువాత సైకిల్ రిపేరు, విడిభాగాల షాపు పెట్టి, స్వంతంగా సైకిళ్ళు తయారు చేశారు. అదే సమయంలో జర్మనీ ఇంజనీరు లిలియెంథాల్ గ్లైడర్ల మీద చేస్తున్న ప్రయోగాల స్ఫూర్తితో విమానం తయారీ మీద దృష్టి పెట్టారు.

మొట్టమొదటి విమానం

తాము రూపొందించిన నమూనా విమానం ప్రయోగానికి నార్త్ కరోలినా రాష్ట్రంలోని కిట్టీ హాక్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. 1901నుంచి 1903వరకూ రకరకాల డిజైన్లకు, ఇంజన్లతో ప్రయోగాలు చేసి, ఎన్నిసార్లు విఫలమైనా విసుగు చెందకుండా 1903 డిసెంబరు నాటికి తమకు సంతృప్తికరంగా ఉన్న విమానాన్ని సిద్ధం చేశారు.

డిసెంబరు 14న అయిదు మంది స్నేహితుల సమక్షంలో విమానాన్ని ప్రయోగించారు. దానిలో మొదటిసారి ఎగిరే అవకాశం బొమ్మ బొరుసు ద్వారా ఆర్విల్ రైట్ దక్కించుకున్నాడు. అయితే అది నేలమీద కాసేపు పరిగెత్తి గాలిలోకి ఎగిరిన వెంటనే కూలిపోయింది. మూడు రోజుల పాటు శ్రమించి దానిని రిపేరు చేసి డిసెంబర్ 17నాటికి మరోసారి ప్రయోగానికి సిద్ధం చేశారు. ఈసారి పైలట్ అవకాశం విల్బర్ రైట్ దక్కించుకున్నాడు.

అయిదు మంది సాక్షుల సమక్షంలో ఉదయం 10:35 గంటలకు గాలిలోకి ఎగిరిన ఆ విమానం రెక్క మీద బోర్లా పడుకుని విల్బర్ రైట్ ఒక చుక్కానితో కంట్రోల్ చేస్తూ 12 సెకన్లపాటు గాలిలో 120 అడుగుల దూరం ప్రయాణించాడు. అదేరోజు సోదరులిద్దరూ మార్చి మార్చి అ విమానం మీద ఎగురుతూ మూడు సార్లు ప్రయోగాలు చేశారు. చివరిసారి 59 సెకన్లపాటు గాలిలో ప్రయాణం చేయగలిగింది ఆ విమానం.

రైట్ ఫ్లైయర్ అని పేరు పెట్టిన తమ విమానానికి మరిన్ని మెరుగులు దిద్ది 1905 కల్లా 39 నిమిషాలపాటు గాలిలో ప్రయాణించేలా రూపొందించారు. 1908లో తమ విమానాన్ని మొదటిసారి ఫ్రాన్సులో ప్రదర్శించి యూరోప్ లో అందరిలో ఆసక్తి రేకెత్తించారు. 1909లో రైట్ సోదరులు రూపొందించిన విమానాలను అమెరికన్ సైన్యం కొనుక్కొంది.

జీవితాంతం బ్రహ్మచారులుగా ఉండిపోయిన రైట్ సోదరులు తమ విమానాన్ని నిర్మించి, అమ్మడానికి రైట్ కంపెనీ మొదలుపెట్టారు. విల్బర్ రైట్ 1912లో టైఫాయిడ్ తో మరణించగా, ఆర్విల్ రైట్ 1948లో మరణించాడు.

మొదటి విమాన ప్రమాదం కూడా

రైట్ సోదరులు రూపొందించిన విమానం సైన్యానికి కూడా ఉపయోగకరమని భావించిన అమెరికా సైన్యం వాటిని కొనాలని భావించింది. కొనేముందు పరీక్షలు జరపడానికి వర్జీనియా ర్రాష్టంలోని ఫోర్ట్ మైయర్ వేదికగా నిర్ణయించారు. ఆర్మీ ఆఫీసర్ థామస్ సెల్ఫ్ రిడ్జెస్ ని కూర్చోబెట్టుకుని ఆర్విల్ రైట్ విమానాన్ని నడుపుతుండగా అది కూలిపోయింది. ఈ ప్రమాదంలో సెల్ఫ్ రిడ్జెస్ మరణించగా, ఆర్విల్ గాయాలతో బయటపడ్డాడు.

రైట్ సోదరులు రూపొందించిన కొత్త ప్రయాణ సాధనం మీద వారి తండ్రి తన జీవితాంతం అపనమ్మకంగానే ఉన్నాడు. అందుకే ఇద్దరూ దానిలో కలిసి ప్రయాణం చేయకూడదని వారి నుంచి ప్రమాణం తీసుకున్నాడు. అయితే తమ జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇద్దరూ కలిసి తమ విమానంలో ప్రయాణం చేశారు. 1910లో ఒక ప్రదర్శనలో భాగంగా ఆర్విల్ రైట్ నడుపుతుండగా విల్బర్ రైట్ పాసెంజర్ సీటులో కూర్చుని ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణం ముగిశాక ఆర్విల్ రైట్ 82 సంవత్సరాల తన తండ్రిని విమానంలో కూర్చోబెట్టుకుని మరోసారి గాలిలోకి ఎగిరాడు. ఒకసారి గాలిలో ఎగిరాక తన తండ్రి చిన్న పిల్లవాడి లాగా “మరింత పైకి, మరింత పైకి” అని కేరింతలు కొట్టాడని ఆర్విల్ రైట్ ఆ తరువాత చెప్పాడు.

చంద్రుడి మీదకు రైట్ ఫ్లైయర్

ఓహయో రాష్ట్రానికే చెందిన మరొక ఏవియేషన్ నిపుణుడు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ రైట్ సోదరుల అభిమాని. 1969లో చంద్రుడు మీద కాలు మోపినప్పుడు అతని స్పేస్ సూటు జేబులో రైట్ సోదరులు మొదటిసారి ఎగిరిన విమానం రెక్క నుంచి చింపిన మస్లిన్ గుడ్డ ముక్క, ప్రొపెల్లర్ తాలూకూ చెక్కముక్క ఉన్నాయి.

12 సెకన్లపాటు ఎగిరిన మొదటి విమానం ఆ తరువాత అనేక మార్పులు చెంది ఏకధాటిగా ఖండాంతరాలు దాటి ప్రయాణం చేయగలిగే స్థాయికి, వాయువేగాన్ని దాటిన వేగంతో ప్రయాణించే స్థాయికి చేరుకుంది.

Jojobet GirişMadridbetMadridbetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetgrandpashabet