iDreamPost
android-app
ios-app

మీరు రోడ్లమీదకు రండి..! మేము ఇంట్లోనే ఉంటాం..!!

మీరు రోడ్లమీదకు రండి..! మేము ఇంట్లోనే ఉంటాం..!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందు, ప్రకటించిన తర్వాత ప్రతి అంశంలోనూ తన, తన మనుషుల ఆర్థిక ప్రయోజనాలు తప్పా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల మేలు అనే అంశాలు చంద్రబాబు నాయుడులో ఏ కోశానా కనిపించలేదనేది నిత్యం వింటున్న మాట. అమరావతి చంద్రబాబు నాయుడు కోసమో, టీడీపీ కోసమో లేదా ఓ సామాజికవర్గం కోసమో కాదు రాష్ట్ర ప్రజల కోసం అంటూ చంద్రబాబు చెప్పే మాటల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నది ఆయన మాటలను బట్టి తెలుస్తుంది. అమరావతిలో జరిగిందంటున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే.. ఆపాలంటూ వర్ల రామయ్య చేత హైకోర్టులో పిటిషన్‌ వేయించినప్పుడే నిజానిజాలు ఏమిటో రాష్ట్ర ప్రజలకు అర్థం అయింది. అందుకే చంద్రబాబు ఎన్ని సార్లు రండి.. ఉద్యమం చేయండి అంటూ పిలుపు ఇచ్చినా కనీసం అమరావతి పరిధిలోని మొత్తం 29 గ్రామాల ప్రజలు స్పందించలేదు.

మూడు రాజధానులు ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయగానే శుక్రవారం రాత్రి చంద్రబాబు జూమ్‌లో మీడియా ముందుకు వచ్చారు. దాదాపు గంటసేపు గతంలో మాట్లాడిన మాటలే మాట్లాడారు. ఈ ప్రెస్‌ మీట్‌ చరిత్రలో నిలిచిపోతుందని తనకు తానే కితాబిచ్చుకున్నారు. అమరావతి కోసం ఉద్యమాలు చేయండంటూ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తన ఆలోచన, పని అంతా రాష్ట్ర కోసమే అంటూ చెప్పుకొచ్చారు. ఇకపై అమరావతి ఉద్యమం 2.0 ప్రారంభమైందని రోబో 2.0 సినిమా టైటిల్‌ మాదిరిగా ప్రకటించారు.

అమరావతి ఉద్యమం 2.0 అంటూ గొప్పగా తాను ప్రకటించిన ఉద్యమంలో చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు పాల్గొనకపోవడం ఇక్కడ విశేషం. తనను నమ్మి భూములు ఇచ్చారని చెప్పిన వారిలో కొంత మంది మాత్రం అమరావతిలో రోడ్లపై ఉన్నారు. టీడీపీ నేతలు అక్కడక్కడా ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కానీ చంద్రబాబు, ఆయన కుమారుడు మాత్రం హైదరాబాద్‌లోని తమ రాజభవనానికే పరిమితం అయ్యారు. అమరావతి ఉద్యమం 200 రోజులు పూర్తయిన రోజున… ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేసి, అవి ట్విట్టర్‌లో పోస్టు చేసిన మాదిరిగా కూడా చంద్రబాబు, లోకేష్‌లు అమరావతి 2.0 ఉద్యమ ప్రారంభంలో స్పందించకపోవడం వెనుక కారణం ఏమిటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.

Read Also : బిటెక్‌ రవి మొదలెట్టారు..!

అమరావతి ఉద్యమం ప్రారంభంలో చంద్రబాబు కుటుంబం అంతా వచ్చి రైతులకు సంఘీభావం తెలిపింది. చేతి గాజులు ఉద్యమం కోసం దానం చేశారు. బాబు జోలె పట్టారు. లోకేష్‌ ప్రతి రోజు అమరావతిలో ఉద్యమాలు జరిగే గ్రామాల్లో పర్యటించి, ప్రసంగించారు. కానీ అమరావతి ఉద్యమం 2.0 లో మాత్రం చంద్రబాబు, లోకేష్‌లు ఇంటి నుంచి కదలడం లేదలకపోవడానికి కారణం కరోనా వైరస్‌ అనే మాట వినిపిస్తోంది. బయటకు వెళితే వైరస్‌ ఎక్కడ సోకుతుందోనన్న భయం చంద్రబాబు, ఆయన పుత్రుడిని వెంటాడుతోందని, అందుకే బాబు జూమ్‌లో, లోకేష్‌ ట్విట్టర్‌కే పరిమితం అయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ ప్రజలను మాత్రం రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేయాలని చంద్రబాబు ఉద్వేగభరిత పిలుపులు ఇస్తుండడం ఇక్కడ గమనార్హం.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomivermectin tabletMadridbetMadridbetPokerklasmeritbetCasibom GirişmeritbetpokerklasBetvolemarsbahis giriş