iDreamPost
android-app
ios-app

సంక్రాంతి 2021 – ఏం జరుగుతుందో

  • Published Jul 16, 2020 | 9:07 AM Updated Updated Jul 16, 2020 | 9:07 AM
సంక్రాంతి 2021 – ఏం జరుగుతుందో

లాక్ డౌన్ ఎంత సడలించినా కేసుల తీవ్రత విషయంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో షూటింగుల కొనసాగింపు, థియేటర్ల తెరిచివేత ఇంకా జరగడం లేదు. టీవీ సీరియల్స్, చిన్న బడ్జెట్ సినిమాలు తప్ప ఇంకెవరు సెట్స్ పైకి వెళ్లే సాహసం చేయడం లేదు. 2020లో ఏడు నెలల కాలం పూర్తి కావొస్తోంది. ఇంకో 150 రోజులు మాత్రమే చేతిలో ఉంది. మాములుగా సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. అందులోనూ టాలీవుడ్ టాప్ స్టార్స్ కోడిపుంజుల్లా పోటీ పడటం, వందల కోట్ల వసూళ్లు వరదలా పారడం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. ఈ ఏడాది కూడా అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు.

అయితే వచ్చే సీజన్ మాత్రం ఆశించిన స్థాయిలో ఉండేలా కనిపించడం లేదు. కారణం స్టార్లు ఎప్పటి నుంచి తమ షూటింగులు మొదలుపెట్టుకుంటారో వాళ్లకే క్లారిటీ లేదు. ఆచార్య, రాధే శ్యామ్, వకీల్ సాబ్, నారప్ప వీటిలో కనీసం రెండు బరిలో దిగుతాయని ప్రేక్షకులు ఆశించినప్పటికీ అది జరిగే అవకాశాలు మెల్లగా సన్నగిల్లుతున్నాయి. అసలు ఎవరు విడుదల చేస్తారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. దసరాకు థియేటర్లు తెరుచుకుంటే నాని వి, రామ్ రెడ్, అరణ్య లాంటివి వెంటనే ఫీడింగ్ కు వాడుకోవచ్చు. క్రేజ్ ఉన్న సినిమాలే కాబట్టి ప్రేక్షకులు ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నవి ఆ టైంకాంతా ఫస్ట్ కాపీని రెడీ చేసుకుంటే గ్యాప్ రాకుండా ఉంటుంది. అలా కాకుండా షూట్స్ కు వెళ్ళకుండా జనవరి దాకా వేచి చూద్దామని పెద్ద హీరోలు ఆగి చూస్తే సమ్మర్ దాకా ఎదురు చూడక తప్పదు.

కానీ పరిస్థితి అక్కడిదాకా రాదనే ట్రేడ్ ఆశాభావంతో ఉంది. ఇప్పటికే హాళ్లు మూతబడి సింగల్ స్క్రీన్ ఓనర్లు ఈ వ్యాపారం మీద ఆసక్తి కోల్పోతున్నారని, వాళ్లకు ధైర్యం కలిగించాలంటే కంటిన్యూగా ప్రతి వారం సినిమాలు ఉండేలా నిర్మాతలు హీరోలు సహకరించాలని కోరుతున్నారు. అయితే ఆరోగ్యం కన్నా ఇంకేదీ ముఖ్యం కాదన్న సూత్రాన్ని ఎవరూ తప్పుబట్టలేరు కాబట్టి తారలను ఖచ్చితంగా షూటింగులో పాల్గొనమనే ఒత్తిడి ఎవరూ చేయలేరు. పైన చెప్పినట్టు జరిగితే మాత్రం సంక్రాంతికి హిందీ సినిమాలు సూర్యవంశీ, 83 లాంటివి వచ్చే ఛాన్స్ ఉంది. ఆలా అయితే పండగ కిక్ మిస్ అయినట్టే. కనీసం వచ్చే నెలకైనా కేసుల ఉధృతి తగ్గితే షూటింగులు వేగమందుకుని పండగకు భారీ చిత్రాలను ఆశించవచ్చు. అదే జరగాలనే అందరి కోరిక.

jojobet girişJojobet GirişCasibomivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetBetvolemarsbahis girişJojobet GirişJojobet Girişcasibom