iDreamPost
android-app
ios-app

నిమ్మగడ్డ ఇప్పటికైనా మనసు మార్చుకుంటాడా ?

  • Published Jan 11, 2021 | 1:50 PM Updated Updated Jan 11, 2021 | 1:50 PM
నిమ్మగడ్డ ఇప్పటికైనా మనసు మార్చుకుంటాడా ?

ఏపీలో పంచాయతీ ఎన్నికల పంచాయితీ మరో మలుపు తిరిగింది. ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేయడం.. సర్కార్ హైకోర్టును ఆశ్రయించడంతో నెలకొన్న ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడింది. ఈ పంచాయతీలో ఏపీ ప్రభుత్వానికి ఊరట కల్గించేలా…. ఎస్ఈసీకి కాదు కాదు నిమ్మగడ్డకు షాకిచ్చేలా ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది..

వివరాల్లోకి వెలితే.. ఏపీలో ఎలాగైనా స్థానిక ఎన్నికలు జరపాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఏపీ సర్కారుకు ఊరట కలిగించేలా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ఇటీవల ఎస్ఈసీ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు స్థానిక ఎన్నికలు అడ్డొస్తాయని హైకోర్టు భావించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ నిలిపివేశామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ పై ఎస్ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదని అభిప్రాయపడింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ, స్థానిక ఎన్నికలు ఒకే సమయంలో నిర్వహించడం కష్టమని కోర్టు పేర్కొంది. కాగా, హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని ఎస్ఈసీ నిర్ణయించినట్టు సమాచారం. ఏపీలో పంచాయతీ ఎన్నికల కోసం ఈ నెల 8న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఏక పక్షంగా నిమ్మగడ్డ షెడ్యూల్ విడుదల.. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమని జగన్ సర్కార్ నిరాసక్తత.. అయినా మొండిగా అందులో వ్యక్తిగతంగా తీసుకున్న ఎేస్ ఈసీ జరిపి తీరాల్సిందే అంటూ ఎన్నికల కోడ్ సైతం అమలులోకి వచ్చిందంటూ హుకుం.. పర్యవసానంగా హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్.. నిమ్మగడ్డకు షాకి స్తూ కోర్టు తీర్పు…ఇదీ క్లుప్తంగా ఏపీ పంచాయితీ ఎన్నికలు… ఈ తంతంగం పై మీడియా ఉత్కంఠ అంటూ..రాజ్యాంగ సంక్షోభం అంటూ కథనాలు వండి వార్చింది.. ఎవరికి తోచింది వారు రాసేసారు.. కానీ అసలు ఈ ఎపిసోడ్ లో ఎక్కడైనా ఎస్ఈసీని పాత్ర ఉందా? లేదు ..కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ వ్యక్తిగత ఇగో ఉంది.. లేదా ప్రతిపక్షాలకు నిమ్మగడ్డ రాజీకీయ అడ్డాగా మారిన వైనం కనిపిస్తోంది..

ఎందుకంటే..

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యాక ఇంతవరకు కోర్టుల జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. కాని ప్రస్తుతం ఏపీ హైకోర్టు నిమ్మగడ్డ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేసింది.. అంతేకాదు కరోనా నేపథ్యం ..వ్యాక్సినేషన్ సందర్భంలో ముందు వెనుకలు ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారని ఎస్ఈసీని తప్పుబడ్డినట్లు తెలుస్తోంది. అంటే ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ద సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా ఏర్పడిందే.. అందులో ప్రజాస్వామ్యానికి అసలు ప్రభువులైన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. అందుకే ఎన్నిక సంఘం కన్నా..ప్రజల యోగ క్షేమాలు సర్కార్ కు ముఖ్యం.. పాలకులకే కాదు ..అధికారులకూ అదే ముఖ్యం కావాలి. కానీ నిమ్మగడ్డ ఎపిసోడ్ లో మాత్రం ప్రజలు.. పక్కకు పోయారు.. స్వప్రయోజనాలు పైకి వచ్చాయి. అందుకే అది ఏస్ఈసీకి, ఏపీ సర్కార్ కు మథ్య తలెత్తిన వివాదమే తప్ప.. రెండు రాజ్యాంగ సంస్థల మధ్య తలెత్తిన వివాదం కాదు..

ఎలాగంటే..

గత మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ , ప్రభుత్వంతో సహకరించకుండానే ఏకపక్షంగా వాయిదావేశారు.. అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వం అధికారులు మా వల్ల కాదు మొర్రో అంటుంటే ..ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు.. నేను సీతయ్యను ఎవరు చెప్పినా వినను ..జరిగి తీరాల్సిందే అనే ధోరణి ప్రదర్శించారు.. చివరకు ఎన్నికల కోడ్ అమలులోకి వ్చచింది..సంక్షేమ కార్యక్రమాలన్నీ నిలిపివేయమని సర్కార్ కు హుకుం జారీ చేశారు.. అంతే కాదు హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు.. గతంలో కోర్టు చెప్పింది ఏమిటి.. ఎస్ ఈసీ, సర్కార్ కలిసి కూర్చొని , సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోమని.. అయితే ఎస్ ఈసీ వద్దకు ఉన్నతాధికారులు వెళ్లి పరిస్థితిలు అనుకూలంగా లేవని విన్నవించనా తోసి రాజని షెడ్యూల్ విడుదలచేసారు..అంటే కోర్టు చెప్పింది కాబట్టి అన్నట్లు సామర్యస్య అనే మాటను తూతూ మంత్రం చేసారు నిమ్మగడ్డ. కానీ రాజ్యాంగ బద్ద సంస్థ ఏదైనా ప్రజల పక్షాన ఆలోచించాలన్న ప్రాథమిక సూత్రం మరిచారు. అంటే ఏపీ సర్కార్ తో నిమ్మగడ్డ వ్యక్తగత కక్ష పెంచుకున్నారు తప్ప.. రాష్ట్రఎన్నికల కమిషనర్ గా ఏమాత్రం ప్రవర్తించలేదన్నది.. ఎన్నికల వాయిదా దగ్గర నుంచి..ప్రస్తుతం హైకోర్టు తీర్వు వరకు గమనిస్తే అర్ధం అవుతోంది.

ఇక రెండు మూడు రోజులుగా మీడియాలో రాజ్యాంగ సంక్షోభం అంటూ ఏవేవో వార్తలు వచ్చాయి. కానీ అసలు రాజ్యాంగ సంక్షోభం ఎప్పుడు వస్తుంది..? హైకోర్టు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించమని తీర్పు నిస్తే.. ఎన్నిక ల నిర్వహణకు ప్రభుత్వం సహకరించకుంటే వస్తుంది. మరి తీర్పు రాకముందే మీడియా ఎందుకు ఇలాంటి కథనాలు రాసినట్లు.? అత్యుత్సాహం..వాటికి కూడా ఏదో రహస్య అజెండా ఉండడం.. అంతేకాదు పంచాయితీ ఎన్నికలు వాయిదా వేసిప్పుడు ఏపీ సర్కార్ సుప్రీం కోర్టున ఆశ్రయించింది.. కాని ఎన్నికల సంఘం నిర్ణయాన్ని న్యాస్థానం సమర్దించింది. ఎందుకు? వాయిదాకు ఎస్ఈసీ చూపిన కారణం కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం.. అందుకే సుప్రీం ఎస్ ఈసీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మరి ఇప్పుడు ప్రభుత్వం కొత్త కరోనా.. పాత కరోనాకు వ్యాక్సినేషన్ ..కార్యక్రమం..కారణంగా నిర్వహణ సాధ్యం కాదని సర్కార్ మొత్తుకన్నా.. ఎస్ఈసీ ..డోన్ట్ కేర్ అంది.. అంతేకాదు ..వాయిదా వేసిన తర్వాతు నిమ్మగడ్డ ..ఎస్ ఈసీ హోదాలో హైదరాబాద్ హోటల్ లో రాజకీయ నాయకలును కలవడం.. తదితర పరిణామాలు చూస్తే నిమ్మగడ్డకు ఏదో వ్యక్తిగత అజెండా ఉందన్న నిజం కామన్ పీపుల్ కు అర్దం అయితే న్యాయస్థానం కు అర్ధం కాదా? ఎందుకంటే సర్కార్ న్యాయవాదులు ఈ విషయాలు కోర్టు దృష్టికి తేకుండా ఉంటారా? అందుకే ఇంతకాలం జరిగింది ఎస్ఈసీ, ఎపీ సర్కార్ అనే రెండు రాజ్యాగం సంస్థల మధ్య పోరుకాదు.. వ్యక్తిగత ఏజెండాతో నిమ్మగడ్డ ..ఏపీసర్కార్ తో సాగించిన పోరు.. అది గమనించని మిడియా..అలా జరిగితే బాగు.. రాజ్యంగ సంక్షోభం వచ్చి ఏపీ సర్కార్ కూలిపోతే బాగుండనే కోరికతో వార్తలు వండి వార్చారని కోర్టు తీర్పును బట్టి అర్ధం అవుతోంది.

మరోైవైపు..ఇంత జరిగినా.. ఎస్ఈసీ తీర్పుపై మళ్లీ కోర్టు వెళ్లాలని నిర్ణయించునట్లు సమాచారం.. దీని ప్రకారం చూసినా ఎస్ఈసీ నిమ్మగడ్డకు వ్యక్తిగత అంజెండా ఉందనిపిస్తోంది. రాజ్యాంగ బద్ద పదవులో ఉన్నవాళ్లు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సర్కార్ పై యుద్దం చేసి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందా? నిజంగా నిమ్మగడ్డ ఎలాంటి వ్యక్తిగత అజెండా లేకుంటే.. వాయిదా వేసినప్పుడు నిమ్మగడ్డ నిర్ణయాన్ని సమర్ధించి కోర్టే.. ఏదే కారణంతో ప్రస్తుతం సర్కార్ ను సమర్ధించిందన్ననిజం గ్రహించాలి.. వ్యక్తిగత ఎంజెండాలతో రాజ్యాంగ బద్ద సంస్థ పరువును కోర్టుల చుట్టూ తిప్పకుండా ..ఇంతటితో హూందాగా సమస్యకు ఫుస్టాప్ పెట్టాలి.. ఎందుకంటే అటు ఎస్ ఈసీకి, ఇటు ప్రభుత్వానికి ముఖ్యం ప్రజలే.. వ్యక్తిగత కక్షలు కావు!

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet