iDreamPost
android-app
ios-app

జగన్ సర్కార్ ఎక్కడా తగ్గలే…..

జగన్ సర్కార్ ఎక్కడా తగ్గలే…..

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక సమస్యలు, అప్పులు, జగన్‌ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు.. ఇలా ఒకటేంటి.. ప్రభుత్వంపై ప్రతిపక్షం ఎన్నో విమర్శలు చేస్తూ వస్తోంది. జగన్‌ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందంటూ ఊకదంపుడు ప్రచారం చేస్తోంది. కానీ.. పరిషత్‌ ఎన్నికల్లో ఘన విజయంతో ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని దక్కించుకున్న వైసీపీకి ఇప్పటికీ ప్రజాదరణ ఇసుమంతైనా తగ్గలేదనే విషయం మరోసారి స్పష్టమైంది. జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలతో జగన్‌ సత్తా మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చగా మారుతోంది.

ఆ విషయం స్పష్టం..

ఈ ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. సీఎం జగన్కు జనాల్లో ఉన్న మద్దతు మరోసారి నిరూపితమైంది. రెండున్నరేళ్లు కావొస్తున్నా ప్రభుత్వం ఎలాంటి వ్యతిరేకత లేదని విషయం సష్టమైంది. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థులు బరిలో దిగారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత జిల్లా అయిన చిత్తూరులో ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి బాబుకు షాకిచ్చింది. చిత్తూరు జిల్లాలో మొత్తం 886 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 822 చోట్ల వైసీపీ తన జెండాను ఎగరవేసింది. అందులో ఇదివరకే 433 స్థానాలు ఆ పార్టీకి ఏకగ్రీవం కాగా.. ఇప్పుడు ఎన్నికల్లో 389 స్థానాలను ఆ పార్టీ దక్కించుకుంది.

ఫలించిన పెద్దిరెడ్డి వ్యూహం…

బాబు కుప్పం కోట కుప్పకూలడం వెనుక అదే జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్‌ నాయకుడు పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలున్నాయి. అక్కడ వైసీపీ ఆధిపత్యం చలాయించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చాపకింద నీరులా టీడీపీని బలహీనపర్చడంలో ఆయన విజయవంతమయ్యారనే టాక్‌ వినిపిస్తోంది. గ్రామస్థాయి నుంచి ఆయన టీడీపీని నరుక్కుంటూ వచ్చారనే విషయం సఁష్టమవుతోంది.

ఇప్పటికీ పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలు సాధించిన ఆ పార్టీ ఇపుఁడు అదే ప్రదర్శన పునరావృతం చేసింది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు చెందిన వాళ్లను పెద్దిరెడ్డి అభ్యర్థులుగా నిలిపారు. పార్టీ కోసం పని చేసిన వాళ్లకు గుర్తింపున్నిచ్చారు. ముఖ్యంగా 23 ఏళ్ల అశ్వినిని కుప్పం పరిధిలో నిలిపి గెలిపించుకోవడం కూడా పెద్దిరెడ్డి వ్యూహంలో భాగమేనని రాజకీయ నిపుణులు అంటున్నారు.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet