iDreamPost
android-app
ios-app

బుట్టబొమ్మలో ప్రేమే కాదు సస్పెన్సూ ఉంది

  • Published Jan 28, 2023 | 5:47 PM Updated Updated Jan 28, 2023 | 5:47 PM
బుట్టబొమ్మలో ప్రేమే కాదు సస్పెన్సూ ఉంది

వచ్చే వారం విడుదలవుతున్న సినిమాల్లో బుట్టబొమ్మ యూత్ ని టార్గెట్ చేసుకుని వస్తోంది. ఇవాళ ట్రైలర్ ని హైదరాబాద్ ఏఎంబి మాల్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ముందు ఈ మూవీలో నటించడానికి కమిటై తర్వాత తప్పుకున్న విశ్వక్ సేన్ చేతుల మీద ఇది జరిగింది. సితార బ్యానర్ కి దీని రూపంలో ఇచ్చిన కమిట్ మెంట్ ని వేరే చిత్రం ద్వారా పూర్తి చేయబోతున్నాడు. సందీప్ కిషన్ మైఖేల్ తో పాటు వారం ముందే స్పెషల్ స్క్రీనింగ్స్ తో హడావిడి చేస్తున్న రైటర్ పద్మభూషణ్ తో బుట్టబొమ్మకు గట్టి పోటీనే ఎదురు కాబోతోంది.

మళయాలం కప్పేలా రీమేక్ గా రూపొందిన ఈ విలేజ్ ఎంటర్ టైనర్ లో కథేంటో ట్రైలర్ లో ఓపెన్ చేశారు. తండ్రి కట్టుదిట్టమైన పెంపకంలో లక్షణంగా పెరిగిన ఓ అమ్మాయి(అనీఖా సురేంద్రన్)కి ఫోన్ లో పరిచయమైన అబ్బాయి(సూర్య వశిష్ట)తో ఫ్రెండ్ షిప్ లవ్ దాకా వెళ్ళిపోతుంది. ఒకరినొకరు చూసుకోకపోయినా విడిచి ఉండలేనంత దగ్గరవుతారు. కలుసుకునే టైం వచ్చినప్పుడు ప్రమాదం ఇంకో కుర్రాడి(అర్జున్ దాస్)రూపంలో తలుపు తడుతుంది. దీంతో అక్కడి నుంచి ఈ జంటకు చిక్కులు మొదలవుతాయి. అసలు స్టోరీ అక్కడి నుంచి షురూ

ఇందులో స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా కేవలం కంటెంట్ ని నమ్ముకుని తెరకెక్కించారు. విశ్వాసం, ది ఘోస్ట్ లతో మనకు పరిచయమైన అనీఖా సురేంద్రన్ కు ఫుల్ లెన్త్ హీరోయిన్ గా ఇదే ఫస్ట్ టాలీవుడ్ మూవీ. మాస్టర్, విక్రమ్ లలో మెప్పించిన అర్జున్ దాస్ ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు. గోపి సుందర్ సంగీతం సమకూర్చారు. శౌరి చంద్రశేఖర్ టి రమేష్ దర్శకత్వం వహించగా డీసెంట్ బడ్జెట్ లో స్వాతిముత్యం తర్వాత సితార సంస్థ తెరకెక్కించిన సినిమా ఇదే. శుక్రవారం కాంపిటీషన్ ని వద్దనుకుని ఫిబ్రవరి 4న రిలీజవుతున్న బుట్టబొమ్మ ఎలా మెప్పిస్తుందో చూడాలి

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişPadişahbet girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel