iDreamPost
android-app
ios-app

బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులే డబ్బులు!!

బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులే డబ్బులు!!

బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులే డబ్బులు..ఎలా వస్తున్నాయో తెలీడం లేదు.. పండగ చేసుకుంటున్న జనం

ఇదేం విచిత్రమో తెలీడం లేదు.. ఒకొక్కరి బ్యాంక్ ఖాతాలోకి 13500 నుంచి 16000 వచ్చి పడుతున్నాయి.ఎందుకు..ఎవరు వేస్తున్నారో తెలీడం లేదు.. మొన్ననే రైతు భరోసా వచ్చింది..అమ్మ ఒడి ఇంకా రాలేదు.. మరి ఈ డబ్బులేంటబ్బా అనుకుంటున్నారు జనం.. ఏదైతేనేం ఊరకనే వస్తున్నాయి.. తీసేద్దాం ..వాడేద్దాం.. సంక్రాంతి పండగ చేసేద్దాం అని జనం హుషారు అవుతున్నారు.

విజయనగరం జిల్లాలో శివరాంపురం గ్రామంలో ఉన్న గ్రామస్తులకు 200 మంది ఖాతాలలో 13,500 రూపాయల నుండి 16 వేల వరకు నగదు వచ్చిపడింది. 607కుటుంబాలున్న ఆ గ్రామంలో వివిధ బ్యాంకుల్లో ఉన్న గ్రామస్తుల ఖాతాలకు నగదు వచ్చి పడింది . మీ ఖాతాలో డబ్బు పడిందని బ్యాంకుల నుండి నగదు జమ అయినట్లు మెసేజ్ లు రావడంతో ఆశ్చర్యానికి గురైన గ్రామస్తులు ఖాతాలను చెక్ చేసుకున్నారు.

భూమి లేనికి వారికి కూడా వచ్చింది … రైతు భరోసా కూడా కాదు .. అయినా ఇలా నగదు జమ కావడంపై గందరగోళానికి గురవుతున్నారు. కొందరు డబ్బు చూసి ఎగిరి గంతెస్తుంటే , మరికొందరు ఎక్కడి నుండి ఈ నగదు వచ్చింది అని ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండటంతో, అది ఎక్కడి నుంచి వచ్చిన నగదు అనేది మాత్రం అర్థం కావడం లేదు. రైతు భరోసా కు చెందిన డబ్బులు అనుకుందామంటే భూమిలేని వారికి కూడా నగదు జమ అయింది .

చాలా మంది ఖాతాదారులు బ్యాంకు ఖాతాలలో నగదు జమ అయినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా విత్ డ్రా చేసి ఎంచక్కా వాడుకుంటూ పండగ చేసుకుంటున్నారు. అధికారులను ఈ డబ్బు పై ప్రశ్నించినా వారి వద్ద కూడా సమాధానం లేదు. కొందరైతే పక్కవాళ్లకు ఈ విషయం చెప్పడం లేదు. చూద్దాం ఏదైతే అది అవ్వనీ.. ముందు పండక్కి బట్టలుకొనేద్దాం అనుకుంటూ సాలూర్ వెళ్లి కొత్త బట్టలు ఇతర వస్తువులు కొనుక్కుంటున్నారు.