iDreamPost
android-app
ios-app

టక్ జగదీష్ దానికి కాపీ కాదు

  • Published Mar 02, 2021 | 5:10 AM Updated Updated Mar 02, 2021 | 5:10 AM
టక్ జగదీష్ దానికి కాపీ కాదు

ఇటీవలే టీజర్ విడుదలై యుట్యూబ్ లో మంచి స్పందన దక్కించుకున్న న్యాచులర్ స్టార్ నాని టక్ జగదీశ్ ఏప్రిల్ 23 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. త్వరలో ప్రమోషన్ల కోసం గట్టి ప్లాన్లు వేస్తున్నారు. ప్రస్తుతం శ్యాం సింగ రాయ్ కోసం కోల్కతాలో ఉన్న నాని వచ్చే నెల మొదటివారంకి కొంత బ్రేక్ తీసుకుని దీన్ని ప్రమోట్ చేసే పనుల్లో బిజీ అవుతాడు. నిన్ను కోరి మజిలీ తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం స్కెచ్ వేసుకున్న దర్శకుడు శివ నిర్వాణ ఈసారి మాస్ టచ్ ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అందులోనూ వీడియోని వెరైటీగా అల వైకుంఠపురములో స్టైల్ లో కట్ చేయడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉండగా దీని లైన్ అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన బలరామకృష్ణులు తరహాలో ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది. ఓ మీడియా వర్గంలో హై లైట్ అయ్యింది కూడా. అందులో శోభన్ బాబు రాజశేఖర్ పాత్రల తరహాలోనే ఇందులో జగపతిబాబు నానిల క్యారెక్టర్లు ఉంటాయని అందులో పేర్కొన్నారు. కానీ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం అలాంటిదేమీ కాదట. కేవలం ఈ ఇద్దరూ సవితి తల్లులకు పుట్టిన అన్నదమ్ములు అనే పాయింట్ తప్ప మిగిలినదంతా టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు.టీజర్ విజువల్స్ లో మాత్రం జగ్గు నానిల మంచి అనోన్యత ఉన్నట్టు కనిపించడం గమనార్హం.

తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్న టక్ జగదీశ్ లో రీతువర్మ హీరోయిన్ గా నటించింది. క్యాస్టింగ్ కూడా కలర్ఫుల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువ ఆకర్షించేలా ఉంది. చాలా ఆశలు పెట్టుకున్న వి డిజిటల్ లోనూ డిజాస్టర్ కావడం నానిని బాగా నిరాశపరిచింది. అందుకే టక్ జగదీష్ మీద గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. దీని తర్వాత ఇదే ఏడాది శ్యామ్ సింగ రాయ్ విడుదల ఉంటుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందబోయే అంటే సుందరానికి కూడా ఈ సంవత్సరమే వస్తుందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ రిలీజయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది

Jojobet GirişMadridbetMariobetmeritbetjojobet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetjojobet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş