iDreamPost
android-app
ios-app

ఆ రెండు సభలను మించి “ద‌ళిత‌బంధు” సభ ఉండాలె..!ఒత్తిడిలో టీఆర్ఎస్ శ్రేణులు

ఆ రెండు సభలను మించి  “ద‌ళిత‌బంధు” సభ ఉండాలె..!ఒత్తిడిలో టీఆర్ఎస్ శ్రేణులు

అదేంటి.. ప్ర‌తిష్టాత్మ‌క ద‌ళిత‌బంధు ప‌థ‌కం టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతుంది కానీ టెన్ష‌న్ ఎందుకు పెడుతుంది అనుకుంటున్నారా? అది ప‌థ‌కం వ‌ల్ల కాదులేండి. హుజూరాబాద్ లో ద‌ళిత బంధు ప్రారంభం సంద‌ర్భంగా ఏర్పాటు చేసే స‌భ గురించే ఆ టెన్ష‌న్ అంతా.

కేసీఆర్ ద‌ళిత బంధు ప‌థ‌కాన్నే కాదు.. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ను చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఆ ఎన్నిక‌లో గెలుపే ల‌క్ష్యంగా మెజార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం  హుజూరాబాద్ లో నిర్వహిస్తున్న దళితబంధు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసే కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరు ఉండాలని భావిస్తున్నారు. దీనికి కారణం గత వారం జరిగిన రెండు సభలేనని చెప్పాలి. ఆదివారం నల్గొండలో నిర్వహించిన రాజకీయ సంకల్ప సభను నిర్వహించారు. మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరేందుకు వీలుగా చేపట్టిన ఈ సభ ఎంతలా సక్సెస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాజీ ఐపీఎస్ అధికారి పిలుపు ఇంత భారీగా జనసమీకరణను తెలంగాణ అధికారపక్షం సైతం ఊహించలేదని చెబుతున్నారు.

సభ జరిగిన తీరు.. సభలో ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ నేతలకు ఏ మాత్రం మింగుడుపడని రీతిలో మారింది. ఇదిలా ఉంటే.. ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి నిర్వహించిన దళిత గిరిజ దండోరా సభకు సైతం భారీగా హాజరు కావటం టీఆర్ఎస్ మీద మరింత ఒత్తిడిని పెంచిందని చెప్పాలి. ఈ రెండు సభల తర్వాత హుజూరాబాద్ లో సోమవారం సభను నిర్వహించనున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో తెర మీదకు వచ్చిన దళిత బంధు కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ఆర్భాటంగా చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకు అన్ని వర్గాల సంపూర్ణ మద్దతు ఉందన్న భావన కలిగేలా సభ ఏర్పాట్లు ఉండాలన్నది గులాబీ నేతల ఆలోచనగా చెబుతున్నారు.

టీఆర్ఎస్ కు ఈ సభ ఎంత ప్రతిష్టాత్మకమన్న విషయాన్ని గురువారం ప్రగతిభవన్ లో నిర్వహించిన రివ్యూ సమావేశం చెప్పకనే చెప్పేస్తుంది. ఈ సమావేశాన్ని ఉన్నతస్థాయిలో నిర్వహించారు.దీనికి ప్రభుత్వంలోని కీలక అధికారులంతా పాల్గొనటంతో పాటు.. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పటం చూస్తే.. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ నేతలు ఇస్తున్న ప్రాధాన్యత ఇట్టే అర్థమవుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు దళిత నేతల్ని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇప్పుడు జరిగిన రెండు సభలకు ధీటుగా సోమవారం కార్యక్రమం ఉండాలన్న కేసీఆర్ లక్ష్యం ఎంతమేర నెరవేరుతుందన్నది సోమవారం కానీ తేలదని చెప్పక తప్పదు.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet