iDreamPost
android-app
ios-app

Spirit : ప్రభాస్ కెరీర్ లో మొట్టమొదటి సారి.. మాములుగా ఉండదు మరి!

Spirit : ప్రభాస్ కెరీర్ లో మొట్టమొదటి సారి.. మాములుగా ఉండదు మరి!

బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటిదాకా కేవలం తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమైన ఆయన క్రేజ్ బాహుబలి సినిమాతో ఖండాంతరాలు దాటింది. అయితే ఆ తర్వాత చేసిన సాహో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు బాగా సాధించినా ఆ సినిమా మా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అనేది మాత్రం నిజం. చివరిగా సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ కరోనా కారణంగా ఇప్పటికీ మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించ లేకపోయాడు. ఆయన హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి సందర్భంగా 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ మరో నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమాను టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాను విజయ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే అనే సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్నారు. ఇవి కాకుండా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను ఈ మధ్యనే ప్రకటించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు కూడా రాధేశ్యామ్, ఆది పురుష్, స్పిరిట్ అనే సినిమాలకు టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ కుమారుడు భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఒక బాలీవుడ్ మీడియా హౌస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి భూషణ్ కుమార్ కీలక వివరాలు వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ తన కెరియర్లో మొట్టమొదటిసారిగా ఒక పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. నిజానికి సాహో సినిమాలో కూడా ప్రభాస్ కొంతసేపటి వరకు పోలీస్ అధికారిగా నటించినా అది నాటకంగా తేలుతుంది. చివరికి ఆయన గ్యాంగ్ స్టర్ గానే సినిమా ముగుస్తుంది. కానీ స్పిరిట్ సినిమా విషయానికి వచ్చేసరికి పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 8 భాషలలో విడుదల కానున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ రాలేదు. కాకపోతే కొరియర్ హీరోయిన్ ను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది.

Also Read : Box Office : 2022 బాక్సాఫీస్ బోణీ ఎలా ఉండబోతోంది

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabet