iDreamPost
android-app
ios-app

భలే మంచి బాక్సాఫీస్ బేరము

  • Published Apr 13, 2021 | 6:12 AM Updated Updated Apr 13, 2021 | 6:12 AM
భలే మంచి బాక్సాఫీస్ బేరము

పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా తప్పుకుంటూ విడుదల వాయిదా వేసుకోవడంతో బడ్జెట్ సినిమాలకు రూట్ క్లియర్ అవుతోంది. రాబోయే రోజుల్లో థియేటర్ల ఆక్యుపెన్సీ మళ్ళీ యాభై శాతానికి కుదిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకంటే మంచి అవకాశం వీటికి దొరకదు. ఎందుకంటే ఓపెనింగ్స్ లో హౌస్ ఫుల్ అయ్యే ఛాన్స్ లేని వాటికి కెపాసిటీ ఎంత ఉన్నా పెద్ద ఇబ్బంది ఉండదు. టాక్ పాజిటివ్ గా వచ్చి జనం పెరిగితే ఆటోమేటిక్ గా స్క్రీన్లు పెంచుకోవచ్చు. వారమో రెండు వారాల్లో వీలైనన్ని రోజులు ఆడించుకుని ఆపై ఎలాగూ ఓటిటి డీల్ ఉంటుంది కాబట్టి రెండు రకాలుగానూ వర్కౌట్ చేసుకోవచ్చు. అయితే కంటెంట్ బలంగా ఉండాలి సుమా.

ఇప్పుడు వెయిటింగ్ లో ఉన్న మీడియం బడ్జెట్ సినిమాలు చాలానే ఉన్నాయి. మొన్నటిదాకా భారీ చిత్రాలు క్యూ కట్టడంతో ఏ డేట్ కు వేసుకోవాలో అర్థం కాక వేచి చూస్తున్న ధోరణిని అవలంబిస్తున్నాయి. ఇప్పుడు మంచి అవకాశం దక్కింది. దాన్నెలా వాడుకుంటారు అనేదే ముఖ్యం. సూపర్ మచ్చి, రాజరాజ చోర, పుష్పక విమానం, వివాహ భోజనంబు, కోతి కొమ్మచ్చి, కిన్నెరసాని, లక్ష్య, వరుడు కావలెను,ఇచట వాహనములు నిలపరాదు, హౌస్ అరెస్ట్, బ్రతుకు బస్ స్టాండ్, రౌడీ బాయ్స్ ఇలా క్యూ చాలా పెద్దదే ఉంది. వీటిలో అధిక శాతం ఫస్ట్ కాపీ సిద్ధమైనవే. సెన్సార్ కోసం అప్లై చేసినవి కొన్ని ఉన్నాయి . చివరిదశలో మరికొన్ని ఉన్నాయి.

కొంచెం అలెర్ట్ అయిపోయి ఇప్పుడీ గ్యాప్ ని వాడుకుని రిలీజులు ప్లాన్ చేసుకుంటే మంచిదే కానీ ఎవరు ముందుకొస్తారు అనేదే పెద్ద ప్రశ్న. కర్ణాటకలో కేసులు పెరుగుతున్న దృష్యా ఈ నెల 20 నుంచి సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని సిఎం యడ్యూరప్ప ప్రకటించడం మిగిలిన రాష్ట్రాల్లోనూ టెన్షన్ పుట్టిస్తోంది. తమిళనాడులోనూ కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. మిగిలింది ఏపీ తెలంగాణనే. కాబట్టి పైన చెప్పినవాటిలో ఎంతమేర ధైర్యం చేస్తాయో చూడాలి. మొత్తానికి వకీల్ సాబ్ మినహాయించి ఏప్రిల్ మొత్తం మహా నీరసంగా ఉండటం ఖాయం. ఇంకే భాషలోనూ ఎగ్జైటింగ్ రిలీజులు లేవు

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş