iDreamPost
android-app
ios-app

వాళ్ళు 16 ఏళ్ళు నిండితే పెళ్లి చేసుకోవచ్చు.. హైకోర్టు తీర్పు..

  • Published Jun 20, 2022 | 7:08 PM Updated Updated Jun 20, 2022 | 7:08 PM
  • Published Jun 20, 2022 | 7:08 PMUpdated Jun 20, 2022 | 7:08 PM
వాళ్ళు 16 ఏళ్ళు నిండితే పెళ్లి చేసుకోవచ్చు.. హైకోర్టు తీర్పు..

పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముస్లిం అమ్మాయిలు 16ఏళ్లు నిండితే పెళ్లిచేసుకోవచ్చని తెలిపింది. సింగిల్ జడ్జి జస్టిస్ బస్ జిత్‌సింగ్ బేడీ ఓ కేసులో భాగంగా తీర్పు ఇస్తూ షరియాలా ప్రకారం ముస్లిం అమ్మాయి 16ఏళ్లకు పెళ్లి చేసుకోవటం సరైనదే అని తెలిపారు.

ఈ నెల జూన్8న పఠాన్ కోటకు చెందిన ఓ 16ఏళ్ల ముస్లిం అమ్మాయి, 21ఏళ్ల అబ్బాయి ఇస్లామిక్ పద్ధతుల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లిని కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు పైగా బెదిరింపులకు గురిచేశారు. దీంతో ఈ జంట తమకు రక్షణ కల్పించాలని హై కోర్టును కోరింది. దీనిని విచారించి జడ్జి జస్టిస్ జిస్జిత్ సింగ్ బేడీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ కేసులో జడ్జి తీర్పునిస్తూ.. ముస్లిం అమ్మాయిల‌ పెళ్లిళ్లు ముస్లిం ప‌ర్స‌న‌ల్ చ‌ట్టం ప‌రిధిలోకి వస్తాయి. ఆర్టిక‌ల్ 195 ప్ర‌కారం ముస్లిం అమ్మాయికి 16 ఏళ్లు నిండాయి, ఆ రూల్ ప్ర‌కారం ఆమె పెళ్లి చేసుకోవ‌చ్చు. అలాగే అబ్బాయి వ‌య‌సు 21 ఏళ్లు దాటాక చేసుకోవాలి. ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా కూడా దీన్ని అంగీకరిస్తుంది. ముస్లిం పర్సనల్‌ లా ప్రకారం యుక్త వయసు వచ్చిన వారు తాము ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. వారిద్దరూ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్న కారణంగా ప్రాథమిక హక్కులను తిరస్కరించలేమని తెలిపి, వారి వివాహానికి హైకోర్టు ఆమోదం తెలిపింది.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş