iDreamPost
android-app
ios-app

రాజకీయాల్లో ముమైత్ ఖాన్.. శ్రీరెడ్డి..!

  • Published Jul 13, 2021 | 11:55 AM Updated Updated Jul 13, 2021 | 11:55 AM
రాజకీయాల్లో ముమైత్ ఖాన్.. శ్రీరెడ్డి..!

రెండు మూడు నెలలుగా తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా ఉంటున్నాయి. టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ బయటికి రావడంతో మొదలైన వ్యవహారం.. తాజాగా కాంగ్రెస్ కు కౌశిక్ రెడ్డి రాజీనామా చేయడం దాకా ఆసక్తికరంగా సాగాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఇద్దరు మహిళా సెలబ్రిటీల పేర్లు రాజకీయ ‘తెర’పైకి వచ్చాయి. వాళ్లకు, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పాలిటిక్స్ కు ఎలాంటి సంబంధం లేకున్నా.. కేవలం ‘పోలిక’ కోసం కించపరిచేలా కామెంట్లు చేస్తున్నారు. ముమైత్ ఖాన్, శ్రీరెడ్డి పేర్లను వాడుకుంటున్నారు. రాజకీయాల్లో కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి ముమైత్ ఖాన్ లాంటి వ్యక్తి అని కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేస్తే.. శ్రీరెడ్డిలా కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు.

కౌశిక్ కామెంట్ల కలకలం

కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్న ఆడియో ఒకటి బయటికి రావడం తెలిసిందే. తనకు హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ అయిందని, యువకులను పార్టీలో చేర్చుకోవాలని, ఒక్కొక్కరికీ రూ.3 వేల నుంచి 5 వేలు అయినా ఇద్దామని మాదన్నపేటకు చెందిన లీడర్ కు అందులో చెప్పారు. ఇది కాస్తా వైరల్ కావడం, కాంగ్రెస్ తొలుత షోకాజ్ నోటీసులు ఇవ్వడం, తర్వాత కౌశిక్ రెడ్డిని పార్టీని నుంచి బహిష్కరించడం చకచకా జరిగిపోయాయి. కాంగ్రెస్ నుంచి తానే రాజీనామా చేస్తున్నట్లు అనంతరం కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కౌశిక్.. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగారు. ‘‘నేనే రాజా, నాదే సినిమా అని రేవంత్ రెడ్డి అంటే ఎలా? ఆయన నిజంగా మార్పు తీసుకువస్తారునుకుంటే.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తన నియోజకవర్గంలోని ఒక్క డివిజన్‌లో కూడా డిపాజిట్‌ ఎందుకు రాలేదు. సొంత నియోజకవర్గంలో డిపాజిట్లు తెచ్చుకోలేదు. రాష్ట్రంలో ఇంకేం చేస్తావ్‌. సినిమాల్లో ముమైత్‌ఖాన్‌ కనిపిస్తే మస్తు సీటీలు కొడుతారు. కాంగ్రెస్‌ పార్టీకి ఇంకో ముమైత్‌ ఖాన్‌ ఈ రేవంత్‌రెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచే సత్తా లేనోడు సీఎం ఎలా అవుతాడు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్.. ఓ యూజ్ లెస్ ఫెలో అంటూ కామెంట్ చేశారు.

Also Read : టీఆర్‌ఎస్‌ టికెట్‌ నాకే.. కాంగ్రెస్‌ నేతకు షోకాజ్‌ నోటీస్‌

కాంగ్రెస్ కౌంటర్..

యాక్షన్ కు రియాక్షన్ ఉంటుంది కదా.. కౌశిక్ రెడ్డి కామెంట్లపై కాంగ్రెస్ లీడర్లు కౌంటర్లు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డిని ముమైత్ ఖాన్‌తో పోల్చిన కౌశిక్ రెడ్డిని శ్రీరెడ్డితో పోలుస్తున్నారు. సిగ్గు, శరం లేకుండా కౌశిక్ మాట్లాడుతున్నారంటూ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఇచ్చే స్క్రిప్టు చదివేందుకు సిగ్గు ఉండాలన్నారు. శ్రీరెడ్డిలా కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. ‘‘కౌశిక్ రెడ్డి.. నువ్వు, నీ అన్న రూ.కోట్లు తీసుకుని జీహెచ్ఎంసీ, జనరల్ ఎలక్షన్లలో టికెట్లు అమ్ముకున్నారు’’ అని ఆరోపించారు. ‘‘వైఎస్ నీకు టికెట్ ఇస్తా అని చెప్పాడా? అప్పుడు నీ వయస్సు ఎంత? చెడ్డీలు కూడా వేసుకోలేదు బిడ్డా’’ అంటూ ఘాటుగా బదులిచ్చారు.

మధ్యలోకి మహిళలను లాగడమేంటి?

ఎక్కడ, ఏ గొడవ జరిగినా మధ్యలోకి ఆడవాళ్లను లాగడం మామూలైపోయింది. ఎలాంటి సంబంధం లేకున్నా అమ్మ, అక్కలను తిడుతుంటారు. ఇప్పుడు కూడా కౌశిక్ రెడ్డి వ్యవహారంలో మహిళలను లాగడం, కించపరిచేలా మాట్లాడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీరు మీరు విమర్శలు చేసుకోవాలి, ఆరోపణలు చేసుకోవాలి.. తిట్టుకోవాలి.. అంతేకానీ మధ్యలో ఏ సంబంధం లేని వ్యక్తులను లాగడమేంటి? ఈ నేతల రాజకీయాలకు, ముమైత్, శ్రీరెడ్డికి ఏం సంబంధం? గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఇలానే జగన్ విషయంలో దూషించారు. మొన్నటి తమిళనాడు ఎన్నికల్లో నాటి సీఎం పళని స్వామి తల్లి గురించి డీఎంకే ఎంపీ రాజా చిల్లర కామెంట్లు చేశారు.

Also Read : కౌశిక్ రెడ్డి యాక్షన్.. డైరెక్షన్ ఎవరిది?

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş