iDreamPost
android-app
ios-app

క‌బ్జా కేసులో ఎంపీ గల్లా జయదేవ్

క‌బ్జా కేసులో ఎంపీ గల్లా జయదేవ్

అధికారంలో ఉండ‌గా చేసిన అక్ర‌మాలు వెలుగులోకి రావ‌డంతో తెలుగుదేశం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు చాలా మందిపై కేసులు న‌మోద‌య్యాయి. కొంద‌రు జైలుకు కూడా వెళ్లొచ్చారు. మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు అయ్యారు. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర జైలుకు వెళ్లి వచ్చారు. మాజీ విప్ కూన రవికీ అరెస్ట్‌ తప్పలేదు. కర్నూలు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవిలు జైలుకు వెళ్లి వచ్చారు. ఒక పెళ్లికి వెళ్లి అనూహ్యంగా కేసులో బుక్కైయ్యారు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి పరిస్థితీ అంతే. ఇప్పుడు తెలుగుదేశం ఎంపీపై కూడా కేసు న‌మోదైంది.

తెలుగుదేశం పార్టీ కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉన్న ముగ్గురు ఎంపీల్లో గల్లా జయదేవ్ ఒక‌రు. తాజాగా ఆయనతో సహా మొత్తం పన్నెండు మందిపై వివిధ సెక్షన్ల కింద భూఆక్రమణ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు వారిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. కార‌ణం ఏంటంటే… చిత్తూరుజిల్లా తవణంపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. గల్లా అరుణకుమారి తండ్రి దివంగత రాజగోపాల్ నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్.. ఎడ్యుకేషన్ సొసైటీల కోసం దిగువమాఘం గ్రామంలో భవనాలు నిర్మించారు. ఆ భవనాల సమీపంలో ఉన్న తన పొలాన్ని అక్రమించారని అదే గ్రామానికి చెందిన రైతు గోపీకృష్ణ కోర్టును ఆశ్రయించారు.

అయితే.. ఈ ప్రయత్నాలు 2015 నుంచి వివిధ రూపాల్లో సాగుతున్నా ఫలితం లేకపోయింది. దీంతో..ఆయన కోర్టును ఆశ్రయించారు. తన భూమిలో ఎంపీ గల్లా జయదేవ్ తో సహా ఆయన కుటుంబ సభ్యులపైనా ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టులో విచారణ చేపట్టారు. చిత్తూరు నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సదరు ట్రస్ట్ సంబంధీకులతో సహా ఆ గ్రామ బాధ్యులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో.. రాజన్న ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ కమ్ ఛైర్ పర్సన్ కమ్ మాజీ మంత్రి గల్లా అరుణకుమారి.. సభ్యులు గల్లా రామచంద్రనాయుడు.. ఎంపీ గల్లా జయదేవ్.. గల్లా పద్మావతి.. గోగినేని రమాదేవి.. కార్యదర్శి సి. రామచంద్రరాజు.. ఉద్యోగులుఎం. పార్థసారథితో పాటు మరికొందరిపైనా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. వీరితో పాటు న్యాయవాది చంద్రశేఖర్.. సర్పంచ్.. కార్యదర్శులపై కూడా కేసులు నమోదు చేసినట్లుగా చిత్తూరు డీఎస్పీ పేర్కొనటం గమనార్హం.

Also Read : మరో వివాదం రాజేస్తున్న జేసీ ప్రభాకర్

jojobet girişJojobet GirişEnbet Girişivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbetCasibom Giriş