iDreamPost
android-app
ios-app

మండలి కార్యదర్శికి కూడా కోర్టు చెప్పాలట..!

మండలి కార్యదర్శికి కూడా కోర్టు చెప్పాలట..!

శాసన వ్యవస్థ చేసే చట్టాలలోనూ, వాటిని అమలు చేసే క్రమంలో కార్యనిర్వాహఖ వ్యవస్థ నిబంధనల్ని ఉల్లంఘించినప్పుడు.. న్యాయశాఖ జోక్యం చేసుకుని వాటిని సరిచేసేలా చూస్తుందని రాజ్యాగంలో పొందుపర్చారు. శాసన శాఖ చేసే పాలనలోనూ, కార్యనిర్వాహఖ శాఖ విధుల్లోనూ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలంటూ, వారు ఏ పని చేయాలో కూడా కోర్టు చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలు ధర్మాసనం తలుపులు పదే పదే తడుతున్నారు. పలు సందర్భాల్లో వారి లక్ష్యం నెరవేరడంతో.. మళ్లీ మళ్లీ వస్తున్నారు.

తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి కోర్టు తలుపు తట్టాడు. సీఆర్‌డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై మండలి సెలక్ట్‌ కమిటీని వెంటనే నియమించేలా మండలి కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. మండలి చైర్మన్‌ ఆదేశాలను కార్యదర్శి పాటించడంలేదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎప్పటిలాగే పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మండలి కార్యదర్శికి అఫిడవిట్లు దాఖలు చేయాలని నోటీసులు పంపింది.

దీపక్‌ రెడ్డి పిటిషన్‌ వేయడం, కోర్టు స్వీకరించడం కాసేపు పక్కనపెడితే.. అసలు ఏపీలో శాసన మండలి పరిస్థితి ఏమిటి..? అనేది ఆలోచించాలి. శాసన మండలిని ఏర్పాటు చేయడం, రద్దు చేయడం అనే అంశాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందన్న విషయం రాజ్యాంగ నిపుణులకు తెలియంది కాదు. మరి ఏపీలో శాసన మండలిని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో తీర్మానం కూడా చేసింది. అది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. ఇటీవల జరిగిన బడ్జెట్‌ సమావేశాలు కరోనా కారణంగా అర్థంతరంగా వాయిదా పడకపోతే.. ఈ పాటికి పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ మండలి రద్దు బిల్లు ఆమోదం పొందేది.

ఏడాదిలో నాలుగు సార్లు పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతాయి. మొన్న కాకపోతే.. త్వరలో జరగబోయే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంట్‌ ముందుకు వస్తుంది. బిల్లు ఉభయ సభల్లో పాస్‌ చేయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఒక నెల అటో ఇటో.. ఏపీలో శాసన మండలి అనేది చరిత్రగా మిగలబోతోందన్న విషయం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. అలాంటి దీపక్‌ రెడ్డి వేసే పిటీషన్లు.. రాజకీయం కోసమో లేదా ప్రభుత్వ పాలన, సంక్షేమం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, టీడీపీ అనుకూల మీడియాకు ఫీడ్‌ కోసమో తప్ప దేనికి పనికి వస్తుంది..? దీపక్ రెడ్డే చెప్పాలి.

Jojobet GirişmeritbetmeritbetmarsbahisPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler