iDreamPost
android-app
ios-app

వెలుగులోకి వెలగపూడి, పీలా భూకబ్జాలు

  • Published Dec 20, 2020 | 5:58 AM Updated Updated Dec 20, 2020 | 5:58 AM
వెలుగులోకి వెలగపూడి, పీలా భూకబ్జాలు

ప్రజల ఆస్తులకి పరిరక్షకులుగా ఉండాల్సిన నాయకులే అధికారాన్ని అడ్డుపెట్టుకుని గుట్టుచప్పుడు కాకుండా అడ్డగోలు దోపీడికి పాల్పడటం , ప్రజల ఆస్తులని కొల్లగొట్టి అనుయాయులకి ఇచ్చుకోవడంలాంటి అనైతిక చర్యలు దేశవ్యాప్తంగా అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5ఏళ్ళలో అధికారం చేతిలో పెట్టుకున్న తెలుగుదేశం నాయకులు మాత్రం ఎటువంటి భయం బెరుకు లేకుండా ప్రజల ఆస్తులని పబ్లిక్ గా కొల్లగొట్టి ప్రభుత్వ భూములలో కబ్జాలకు పాల్పడిన వైనం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.

ఇప్పటికే తెలుగుదేశం నేతలుగా ఉన్న సబ్బం హరి, మాజీ ఎంపీ గీతం ఎంవీవీఎస్ మూర్తి, గంటా శ్రీనివాసరావు, హర్షవర్థన్ చౌదరి, గోరెల్ల శ్రీధర్ లాంటి ప్రబుద్దులు చేసిన భూ కబ్జాలపై అధికారులు కొరడా జులిపించగా తాజాగా మరో ఇద్దరు తెలుగుదేశం నేతలు చేసిన భూ కబ్జాలు వెలుగులోకి రావడంతో అధికారులు వాటిపై కూడా కొరడా జులుపించారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే గా ఉన్న వెలగపూడి రామకృష్ణ తన భార్య పేరిట రుషికొండలోని సర్వే నెంబర్ 21లో గడ్డ పోరంబోకు ఆక్రమించి షెడ్డు, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూమిని స్వాదీనం చేసుకున్న అధికారులు వాటికి హద్దులు ఏర్పాటు చేశారు.

అలాగే అనకాపల్లి మాజీ శాసన సభ్యులు పీలా గోవింద్ ఆక్రమణలో ఉన్న ఆనందపురం మండలంలో కొండ పోరంబోకు భూమి 300 ఎకరాలను రెవెన్యు అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ 300 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం నేతలు రాష్ట్రవ్యాప్తంగా అధికారం అడ్డంపెట్టుకుని వాగులూ, వంకలు, అటవీ భూములు, ప్రభుత్వ స్థలాలు తమ సొంత భూములు అన్నట్టుగా కబ్జా చేయడం, అక్రమ నిర్మాణాలకు పాల్పడటం ఆపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిని దబాయించటం చూస్తే తెలుగుదేశం పార్టీ  కబ్జాకోరుల ముఠాకు నిలయంగా మారిందా అనే అనుమానం ప్రజల్లో వ్యక్తం అవుతుంది.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş