iDreamPost
android-app
ios-app

ఆ సిఫార్సులు జగన్ కేనా? మీకు కూడా వర్తిస్తాయి బాబు గారూ!!

ఆ  సిఫార్సులు జగన్ కేనా? మీకు కూడా వర్తిస్తాయి బాబు గారూ!!

ప్రజా ప్రతినిధులపై సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న కేసులపై అమికస్ క్యూరీ సర్వోన్నత న్యాయస్థానానికి కొన్ని సిఫార్సులు చేసింది. ఏపీ ప్రతిపక్షం టీడీపీ ఈ సిఫార్సులు కేవలం సీఎం జగన్ కే వర్తిస్తాయని వాదించడం విడ్డురంగా ఉందంటూ ప్రచారం జరుగుతోంది.

ప్రజా ప్రతినిధులపై సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని కోరుతూ అశ్వని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ లో అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది విజయ్ హన్సరియా ఓ జాబితాను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఆ జాబితా ప్రకారం దేశ వ్యాప్తంగా 2,556 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపిలు పలు కేసులలో నిందితులుగా ఉన్నట్లు తేలింది. ఇదే సమయంలో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కేసులు ఉన్న ప్రజా ప్రతినిధుల సంఖ్య 4,442 కు చేరుకోవడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజా ప్రతినిధులపై 263 కేసులు నమోదైనట్లు ఈ జాబితాలో తేలింది. ఏడుగురు స్టేలు తెచ్చుకున్నట్లు ఈ జాబితా వెల్లడించింది. వీరిపై నమోదయిన కేసులను త్వరితగతిన విచారణ జరపాలని అమికస్ క్యూరీ సుప్రీంకి కొన్ని సూచనలు చేసింది.

టీడీపీ నాయకుల విమర్శలు

దీంతో ఈ సిఫార్సులు ఏపీ సీఎం జగన్ కు తీవ్ర ఇబ్బందులలోకి నెట్టిందని ఓ వర్గం మీడియా కథనాలను ప్రచురించాయి. ఇక టీడీపీ నాయకుల హడావిడి గురించి చెప్పవలసిన అవసరమే లేదు. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గురించి మొదలెట్టి యనమల దాక ప్రతి ఒక్కరూ ఈ సిఫార్సుల గురించి చెబుతూ ఏపీ సీఎం జగన్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి అయితే ఏకంగా రెండు అడుగులు ముందుకేసి ఈ సిఫార్సులతో జగన్ సీఎం నుంచి దిగిపోతారని జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఓ విషయంపై చర్చ జరుగుతోంది. అమికస్ క్యూరీ సిఫార్సులు కేవలం జగన్ కే కాదు మీకు కూడా వర్తిస్తాయి బాబు గారు అంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. మరి ఈ విషయం టీడీపీ నాయకులకు, ఆ మీడియా వర్గాలకు తెలియవా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

అమికస్ క్యూరీ సిఫార్సులు టీడీపీకి వర్తించవా

‘గుడ్డ కాల్చి మోహన విసిరే’ చందాన టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు వినబడుతున్నాయి. దాదాపు 20 కేసులలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకున్నారు. కొన్ని కేసులు అయితే ఏకంగా 14 సంవత్సరాలకు పైగా స్టేలు కొనసాగుతున్నాయి. ఇటీవలే ఎంపీ, బీజేపీ నాయకుడు జీవిఎల్ కూడా సుదీర్ఘ కాలం పాటు స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు రికార్డు క్రియేట్ చేశారంటూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. మరి నిరంతరం జగన్ పై విమర్శలు చేసే టీడీపీ నాయకులకు తమ నాయకుడి విషయం గుర్తుకు రాకపోవడం విడ్డురమే అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ‘నాట్ బిఫోర్’ అనే క్లాజ్ ను ఉపయోగించుకొని చంద్రబాబు బయటపడ్డ సంగతి రాష్ట్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదని వార్తలు వినబడుతున్నాయి. ఏలేరు స్కాం, గచ్చిబౌలి 330 ఎకరాల కేసులలో ఆయన ఏవిధంగా బయటపడ్డారో తమకు తెలుసని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబు స్టే తెచ్చుకొవడం గ్యారంటీ

ఇవ్వన్నీ ప్రక్కన పెడితే తాజాగా అమరావతి భూముల అంశంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ ప్రభుత్వం సిట్ ను నియమించింది. దానిపై లోతయిన విచారణ జరిపేందుకు సీబీఐకి కూడా అప్పగించింది. ఇదే సమయంలో ఫైబర్ నెట్ విషయాన్ని కూడా చూసుకోమని సీబీఐకి ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నేర చరితులకు ఏడాదిలోపు శిక్షలు పడాలనే వాదించే టీడీపీ నాయకులు చంద్రబాబు పాత 20 కేసులకు కొత్త కేసులు (ఓటుకు నోటు) కలిపితే ఎన్ని అవుతాయో తెలియంది కాదు. చంద్రబాబు తన పలుకుబడిని ఉపయోగించుకొని ఈ విచారణపై స్టే తెచ్చుకోవడం గ్యారంటీ అంటూ వార్తలు ప్రచారం ఉన్నాయి. మరి ఇవ్వన్ని మర్చిపోయిన టీడీపీ నేతలు అమికస్ క్యూరీ సిఫార్సులు జగన్ కే వర్తిస్తాయి అంటూ చెప్పడం మాత్రం హాస్యస్పదమనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş