iDreamPost
android-app
ios-app

టీడీపీ నేత‌ వేధింపులు బాలిక ఆత్మహత్య

టీడీపీ నేత‌ వేధింపులు బాలిక ఆత్మహత్య

ఒక అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకోవ‌డం విజయవాడ లో క‌ల‌క‌లం రేపుతోంది. ఆమె ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలిసి అంద‌రూ విస్తుపోతున్నారు. ఓ టీడీపీ నేత వేధింపులు తాళ‌లేకే తాను చ‌నిపోతున్న‌ట్లు బాలిక సూసైడ్ నోట్ రాయడం రాజ‌కీయంగా సంచలనంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక ఉండే అపార్ట్‌మెంట్‌లోనే నివాసం ఉంటున్న టీడీపీ నేతను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా అతడి ఇంటిని కూడా సీజ్ చేశారు. విచార‌ణ‌లో ఈ ఘ‌ట‌న‌లో కీల‌క విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక టీడీపీ నేత‌ల వినోద్‌ జైన్‌ను తనను ఎలా ఇబ్బంది పెట్టాడో సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. దీంతో ఈ ఘటనపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న టీడీపీ నేత 37వ డివిజన్‌ కార్పొరేటర్‌గా పోటీ చేశాడు. అత‌డికి అధినేత చంద్ర‌బాబు స‌హా.. పలువురు కీలక నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న టీడీపీలో కూడా క‌ల‌క‌లం రేపుతోంది.

ఆత్మ‌హ‌త్యకు ముందు..

బాలిక ఆత్మ‌హ‌త్య వెనుక టీడీపీ నేత ఉండ‌డంతో ఈ ఘ‌ట‌న ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నేత వినోద్ జైన్ తనను వేధిస్తున్న విధానాన్ని ఆమె తన పుస్తకంలో రాసినట్టు, సదరు టీడీపీ నేత కూడా బాలిక నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోనే ఉంటున్నట్లు తెలిసింది. టీడీపీ నేత వినోద్ జైన్ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. బాధిత కుటుంబం నివాసానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేరుకున్నారు. ఆత్మ‌హ‌త్య‌కు ముందు బాలిక ఏడుస్తూ టెర్ర‌స్ పై అటూ ఇటూ తిరిగిన‌ట్లుగా సీసీ ఫుటేజీలో రికార్డ‌యింది.

శిక్ష ప‌డేలా చేస్తాం : మంత్రి

చిన్నారి బంధువులతో.. అపార్ట్మెంట్ వాసులతో మంత్రి వెల్లంపల్లి మాట్లాడారు. 24 గంటల్లో వినోద్ జైన్ ను ఉరి తీస్తేనే చిన్నారి కుటుంబానికి న్యాయం చేసినట్టు అని చిన్నారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిపై న్యాయపరంగా కఠిన శిక్షలు తీసుకునేలా చేస్తామని మంత్రి వెల్లంపల్లి హామీ ఇచ్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి ఆత్మహత్య చేసుకుంది, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. లైంగిక వేధింపులకు గురి చేసిన వినోద్‌ జైన్‌ గురించి ఎందుకు చెప్పలేకపోయిందో ఆ చిన్నారి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి ఎవరికైనా చెబితే ఇంట్లో వాళ్లని ఏమైనా చేస్తామని భయపెట్టాడా..? వినోద్ జైన్ మందబలం చూసి భయపడిందా..? వినోద్ జైన్ కు శిక్ష పడాలనే ఉద్దేశంతోనే వివరంగా సూసైడ్ నోట్ రాసిందని వాసిరెడ్డి పద్మ అన్నారు. కాల్‌ మనీ, సెక్స్‌ రాకెట్‌ తెరమీదకు వచ్చినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కాదని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. అంతా జరిగాక పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తే సరిపోతుందా అంటూ టీడీపీని దుయ్యబట్టారు. వినోద్‌ జైన్‌కు ఉరి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

మ‌హిళ‌ల‌ను వేధిస్తూ నారీ సంక‌ల్ప దీక్షా? ఎమ్మెల్యే ఆర్‌కే రోజా

టీడీపీ నేత వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా స్పందించారు. బాలిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయమని విచారం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు మహిళలను వేధిస్తూ నారీ సంకల్ప దీక్ష ఎలా చేస్తారని రోజా సూటిగా ప్రశ్నించారు. టీడీపీ నేతలు తప్పుడు పనులు చేస్తూ ఇతరులపై నెట్టేందుకు యత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఓ తండ్రిలా చూసుకోవాల్సిన 60 ఏళ్ల వయసున్న వ్యక్తి బాలికను ఎంతలా వేధించాడో ఆమె పుస్తకంలో రాసుకున్న విషయాలను బట్టి చూస్తే అర్థం అవుతుందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక సూసైడ్‌ నోట్‌లో రాసిందని ఎమ్మెల్యే రోజా చెప్పారు.

ప్రభుత్వం అండగా ఉంటుంది

విజయవాడ భవానీపురంలో బాలిక ఆత్మహత్య ఘటన బాధాకరమని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. టీడీపీ నేత వేధింపులే కారణమని బాలిక సూసైడ్‌ నోట్‌ రాసిందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. వినోద్ జైన్.. కేశినేని నాని ముఖ్య అనుచరుడని, వినోద్ తరపున ప్రచారం చేసిన చంద్రబాబు , ఇప్పుడు ఈ ఘటనపై ఏం సమాధానం చెప్తారని మంత్రి వెల్లంప‌ల్లి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాపకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

ప్రభుత్వాసుపత్రి మార్చురీకి చేరుకున్న మంత్రి వెల్లంపల్లి పోస్టుమార్టం ప్రక్రియ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు. అనంతరం బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet