iDreamPost
android-app
ios-app

తమిళ స్టార్ దళపతి విజయ్ బర్త్‌డే CDP లాంచ్ చేస్తూ పూజాహెగ్డే స్పెషల్ ట్వీట్..

  • Published Jun 19, 2022 | 7:07 PM Updated Updated Jun 19, 2022 | 7:07 PM
తమిళ స్టార్ దళపతి విజయ్ బర్త్‌డే CDP లాంచ్ చేస్తూ పూజాహెగ్డే స్పెషల్ ట్వీట్..

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన 48వ పుట్టినరోజును జూన్ 22న జరుపుకోనున్నారు. సౌత్ పరిశ్రమల్లో ఎవరైనా స్టార్ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటే వారి కోసం బర్త్‌డేకి ముందు CDP రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ స్టార్ కి సంబంధించిన కొన్ని ఫొటోలతో ఓ ఫోటోని తయారు చేసి స్పెషల్ గా విషెష్ చెప్తారు. అభిమానులు అంతా ఆ స్టార్ బర్త్‌డే రోజున అదే ఫోటోని రకరకాలుగా ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉంటారు.

ఇప్పుడు విజయ్ బర్త్‌డే రోజుకు కూడా కామన్ డిస్‌ప్లే పిక్చర్ (CDP)ని డిజైన్ చేశారు. ఈ CDPని ఇవాళ హీరోయిన్ పూజా హెగ్డే ట్విట్టర్ ద్వారా రివీల్ చేసింది. పూజా హెగ్డే బీస్ట్ సినిమాలో విజయ్ సరసన నటించింది. ఈ CDPలో విజయ్ నటించిన వివిధ సినిమాల్లోని పాత్రలు పెయింట్ వేసినట్టు డిజైన్ చేశారు. పూజా హెగ్డే విజయ్ CDPని ట్వీట్ చేస్తూ.. దళపతి విజయ్ సర్ పుట్టినరోజును జరుపుకోవడానికి కామన్ DPని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది అని పోస్ట్ చేసింది. దీనికి #Thalapathy48BirthdayCDP అనే కామన్ హ్యాష్ ట్యాగ్ ని కూడా జత చేసింది.

పూజా హెగ్డే విజయ్ బర్త్‌డే CDP లాంచ్ చేయగానే విజయ్ అభిమానులు డాన్ని షేర్ చేస్తూ, సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ అభిమానులు జూన్ 22న తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకల్ని గ్రాండ్ గా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. అలాగే విజయ్ పుట్టిన రోజు కానుకగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజయ్ 66వ సినిమా నుంచి అప్ డేట్ ఉండనుందని ప్రకటించారు.

Jojobet GirişmeritbetholiganbetKavbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetjojobetholiganbetMadridbetMadridbetcasibom girişjojobet girişCasibom Girişmeritkingsuperbetinjojobetholiganbet girişholiganbet girişMarsbahis GüncelHoliganbet GirişHoliganbet Güncel GirişMarsbahis GirişMarsbahis Güncel Giriş