iDreamPost
android-app
ios-app

భారత విజయం లాంఛనమేనా???

భారత విజయం లాంఛనమేనా???

రేపు  పూణే వేదికగా భారత్, శ్రీలంకల మధ్య మూడో టి20 మ్యాచ్ జరగనుంది.కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించిన భారత జట్టు,శ్రీలంకను ఈ మ్యాచ్లో ఓడించి సిరీస్ ను కూడా సొంతం చేసుకోవాలని భావిస్తుంది.

బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ లోని ఓపెనర్ ధావన్ మినహా అందరు సూపర్ ఫామ్ లో ఉండడంతో లంకా బౌలర్లు భారత బ్యాట్స్ మెన్ల పరుగుల దాహమును అడ్డుకోవడం అసాధ్యం అనిపిస్తుంది.గత డిసెంబర్లో జరిగిన వెస్టిండీస్ సిరీస్ నుంచి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ రెండో టీ20 లో కూడా రాణించి ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.

రెండవ టి-20లో యువ ఫేస్ బౌలర్లు నవదీప్ సైని వేగముతో,శార్దూల్ టాకూర్ వైవిధ్యంతో అంచనాలు మించి యార్కర్లు,షార్ట్ పిచ్ బంతులతో రాణించారు. గాయం కారణంగా మూడు నెలల తర్వాత ఆడుతున్న స్పీడ్ స్టార్ బుమ్రా త్వరగా బౌలింగ్ లయ అందుకుంటే లంక బ్యాట్స్మెన్ ల కష్టాలు రెట్టింపు అవుతాయి.హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఆల్ రౌండర్ కోటాలో జట్టులో స్థానం సంపాదించిన శివం దూబే బౌలింగ్ సేవలను ఈ మ్యాచ్లో కెప్టన్ కోహ్లీ ఉపయోగించనున్నారు.

గత ఏడాది చివర జరిగిన బంగ్లాదేశ్,వెస్టిండీస్ సిరీస్ లలో భారత్ చేసిన ఫీల్డింగ్ తప్పిదాలు తగ్గినప్పటికీ క్యాచ్ లా జారవిడిచే అలవాటు రెండో టీ20 లో కూడా కొనసాగింది.కీలక సమయాలలో జారవిడిచిన క్యాచ్ లే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే అవకాశం ఉంది.విజయావకాశాలు దెబ్బతినకుండా భారత ఆటగాళ్లు మెరుగైన గ్రౌండ్ ఫీల్డింగ్,నాణ్యమైన క్యాచింగ్ చెయ్యాలని జట్టు యాజమాన్యం కోరుకుంటుంది.

భారత ఆటగాళ్లు సమిష్టిగా బ్యాటింగ్,బౌలింగ్ విభాగాలలో రాణిస్తుండటంతో శ్రీలంకకు విజయంపై పెద్దగా ఆశలు లేకపోయినప్పటికీ గౌరవప్రదమైన పోటీ ఇవ్వాలని భావిస్తుంది.ఈ మ్యాచ్ ను గెలిచి మూడు మ్యాచ్ల సిరీస్ ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ మైదానంలో అడుగుపెట్టబోతోంది.

jojobet girişJojobet GirişCasibomivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetBetvolemarsbahis girişJojobet GirişJojobet Girişcasibom