iDreamPost
android-app
ios-app

వివాదాస్పద కథతో సూర్య మూవీ

  • Published Jul 06, 2020 | 9:46 AM Updated Updated Jul 06, 2020 | 9:46 AM
వివాదాస్పద కథతో సూర్య మూవీ

ప్రస్తుతం ఆకాశం నీ హద్దురా విడుదల కోసం ఎదురు చూస్తున్న సూర్య దాని తర్వాత ప్రాజెక్ట్స్ ని కూడా వరసగా లైన్లో పెట్టేస్తున్నాడు . సుధా కొంగర దర్శకత్వంలో ఎయిర్ డెక్కన్ అధినేత గోపీనాథ్ బయోపిక్ గా రూపొందిన ఈ మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ బాగా ఆకట్టుకోవడంతో తెలుగులోనూ క్రేజీ బిజినెస్ జరిగింది. థియేటర్లు తెరుచుకోగానే కొత్త డేట్ ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా సింగం సిరీస్ ఫేం హరి డైరెక్షన్ లో సూర్య ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. కాని స్టొరీ పరంగా చాలా భారీ సెటప్ అవసరం ఉండటంతో ప్రస్తుతానికి వాయిదా వేసి ధనుష్ తో తీసిన అసురన్ తో మనకూ దగ్గరైన వెట్రిమారన్ మూవీని ముందు తీసే ఆలోచన జరుగుతోందట. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

తమిళనాడు జనజీవనంలో ఓ భాగంగా ఉన్న జల్లికట్టు బ్యాక్ డ్రాప్ లో ఇది రూపొందుతుందట. ఎద్దులతో పాటు పరిగెత్తుతూ యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకునే ఈ ఆట మీద వివాదాలు, కోర్టు కేసులు నడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఇది నిరాటంకంగా కొనసాగుతోంది. మరో విశేషం ఏంటంటే సూర్య తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తాడట. జల్లికట్టు ఆటలో ఓ ఎద్దు చేతిలో తన తండ్రి ప్రాణాలు కోల్పోతే దానికి బదులుగా కొడుకు ఏం చేసి అదే ఎద్దు మీద గెలిచాడనే పాయింట్ మీద సాగుతుందని తెలిసింది. ఇందులోనే శరత్ కుమార్, రాధికలను తీసుకునే ప్రతిపాదన కూడా ఉందట. అయితే ఎద్దు మీద రివెంజ్ అనే పాయింట్ కొంత వింతగా ఉన్నప్పటికీ వెట్రిమారన్ తనదైన శైలిలో చాలా డ్రామా మిక్స్ చేసినట్టు చెన్నై టాక్.

కమర్షియల్ అంశాలతో పాటు ఆలోచింపజేసే బలమైన సందేశం ఇస్తాడనే పేరున్న ఈ దర్శకుడు ఇప్పటిదాకా ఫెయిల్యూర్ అనేది చవిచూడలేదు. రొటీన్ ఫార్ములాకు దూరంగానే సినిమాలు తీస్తూ వచ్చారు. అందుకే ఆసురన్ ఏకంగా మన వెంకటేష్ నే మెప్పించి రీమేక్ చేసేలా ప్రేరేపించింది. ఇప్పుడీ సినిమాకు వడివాసల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గతంలో ఈ బ్యాక్ డ్రాప్ లో కమల్ హాసన్ పోతురాజు వచ్చింది. విమర్శకుల ప్రశంసలు వచ్చాయి కాని మరీ గొప్ప విజయం అందుకోలేకపోయింది. ఎమోషన్స్ ని బ్రహ్మాండంగా పండిస్తాడని పేరున్న వెట్రిమారన్ ఇప్పుడీ జల్లికట్టు కథను ఎలా తీస్తాడో వేచి చూడాలి. హీరొయిన్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. సంగీతం జివి ప్రకాష్ సమకూరుస్తున్నాడు. షూటింగులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. గతే రెండేళ్ళుగా సరైన సక్సెస్ లేక వెయిటింగ్ లో ఉన్న సూర్యకు ఇప్పుడిది పెద్ద బ్రేక్ ఇచ్చేలా ఉంది

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabet