iDreamPost
android-app
ios-app

నితిన్ సినిమాకు సూపర్ డీల్ ?

  • Published Jun 25, 2021 | 6:30 AM Updated Updated Jun 25, 2021 | 6:30 AM
నితిన్ సినిమాకు సూపర్ డీల్ ?

రాబోయే రోజుల్లో మంచి అంచనాలు ఉన్న సినిమాల్లో నితిన్ మాస్ట్రో ఒకటి. గత కొద్దిరోజులుగా డైరెక్ట్ ఓటిటి రిలీజవుతుందన్న ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం డీల్ ఫైనల్ అయ్యిందట. డిస్నీ హాట్ స్టార్ ఈ సినిమాకు గాను 32 కోట్ల రూపాయలకు ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ఇందులో ఆడియో, ఇతర బాషల డబ్బింగ్ తదితరాలు కలపలేదు. ఇది హిందీ రీమేక్ కాబట్టి అక్కడ పెద్దగా వర్కౌట్ కాకపోవచ్చు. తమిళంలో ప్రశాంత్ హీరోగా తీస్తున్నారు కాబట్టి అక్కడా ఛాన్స్ లేదు. మలయాళంలోనూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఎటొచ్చి తెలుగు మీద వీలైనంత రాబట్టుకోవాలి.

ఎలా చూసుకున్నా ఇది చాలా భారీ మొత్తం. పబ్లిసిటీ, ఈవెంట్లు చేయడం, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ఈ ఖర్చులన్నీ మిగిలిపోయినట్టే. అయితే టీమ్ తరఫున హాట్ స్టార్ కోసం ప్రమోషన్లలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇదింకా అఫీషియల్ గా ప్రకటించలేదు. మాస్ట్రో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ వార్త నిజమైతే ఆగస్ట్ లో ప్రీమియర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. స్వతహాగా డిస్ట్రిబ్యూటర్ కం ఎగ్జిబిటరైన నిర్మాత కం నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఇలా ఓటిటి వైపు టర్న్ తీసుకోవడం చూస్తే థియేటర్లకు వంద శాతం ఆక్యుపెన్సీ ఇప్పట్లో రావడం కష్టమే అనిపిస్తోంది

అందులోనూ నితిన్ మార్కెట్ కూడా కొంత డిఫెన్స్ లో ఉంది. చెక్, రంగ్ దే ఫలితాలు ప్రభావం చూపించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్ట్రో లాంటి క్రైమ్ థ్రిల్లర్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కు వచ్చే సీన్ ఉండకపోవచ్చు. రిస్క్ తీసుకుని ఒకవేళ ఏదైనా తేడా జరిగితే నష్టం భారీగా ఉంటుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన మాస్ట్రోలో నభా నటేష్ హీరోయిన్ కాగా తమన్నా నెగటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్ర చేస్తోంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. ఓటిటిలో రావడం లేదని మాస్ట్రో యూనిట్ ఎక్కడా ఖండించే ప్రయత్నాలు చేయలేదు కాబట్టి ఈ న్యూస్ నిజమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alAlobetAlobetberlinbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş