మొదటి టెస్ట్ లో రూట్ బ్యాటింగ్ తో ఓడిపోయిన న్యూజిలాండ్, రెండో టెస్ట్ లో మాత్రం మొదటి రోజు దంచికొట్టింది. ట్రెండ్ బ్రిడ్జ్ లో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మేన్ డారిల్ మిచిల్ కొట్టిన భారీ సిక్సర్, స్టాండ్స్‌లో మహిళ తాగుతున్న బీర్ గ్లాస్ కు తగిలింది. దెబ్బకు గ్లాస్ పగిలింది. జాక్ లీచ్ బౌలింగ్‌లో మిచెల్ బౌలర్ నెత్తిమీద నుంచి లాగి కొట్టాడు. బంతి సరాసరి గ్యాలరీలో కూర్చోని మ్యాచ్ చూస్తున్న అభిమాని బీర్ గ్లాస్లో పడింది.
గ్లాస్ పగిలింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లండ్ ఆటగాడు మాథ్యూ పాట్స్, బాల్ ఎక్కడ పడిందో సైగలు చేస్తూ చెప్పాడు. న్యూజిలాండ్ జట్టు ఆ ఆభిమానికి మరో కొత్త బీర్‌ను అందజేసింది. ఈ సంగతిని ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ ట్విటర్లో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్.
Alexa please play Bachke Rehna Re Baba 🎶@dazmitchell47 ensuring spectators keep their vigil like 🤌🏻@englandcricket @BLACKCAPS#ENGvNZ #SirfSonyPeDikhega #SonySportsNetwork pic.twitter.com/UDqOAs2H8Z
— Sony Sports Network (@SonySportsNetwk) June 10, 2022
77637