iDreamPost
android-app
ios-app

దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో ఎన్ని ప్రమాదాలు జరిగాయి..? ఎంత మంది మృతి చెందారు..?

దేశవ్యాప్తంగా పరిశ్రమల్లో ఎన్ని ప్రమాదాలు జరిగాయి..? ఎంత మంది మృతి చెందారు..?

దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కు రెండు నెలల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో పరిశ్రమలు తెరుచుకున్నాయి. దీంతో పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్యాస్ లీకేజీ, పేలుళ్లు వంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు, కార్మికులు మృతి చెందారు.

ఈ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా ఎన్ని పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాయంటే..? ఈ ఏడాది మే నుండి పరిశ్రమలలో కనీసం 33 ప్రమాదాలు జరిగాయి. 76 మంది మృతి చెందారు. 195 మంది తీవ్రంగా గాయపడ్డారు. మే 3 నుంచి జూలై 14 మధ్య జరిగిన 33 ప్రమాద ఘటనల్లో ఛత్తీస్‌గఢ్ నుండి గరిష్టంగా ఏడు ఘటనలు జరిగాయి. గుజరాత్‌లో ఆరు, మహారాష్ట్రలో నాలుగు ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఈ అన్ని ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో పరిశ్రమల్లో కార్మికులు, పరిశ్రమలకు సమీప దూరంలో ఉన్న నివాసితులు విషపూరిత రసాయనాలకు గురయ్యే కనీసం అవకాశం ఉంది. ఈ ప్రమాదాల వల్ల రాబోయే నెలలు లేదా సంవత్సరాల్లో ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయనేది హెచ్చరిక సంకేతం.

చత్తీస్‌గఢ్ లోని బొకారో స్టీల్ ప్లాంట్‌లో నాలుగు ప్రమాదాలు జరిగాయి. ఈ కాలంలో ఒకే పరిశ్రమలో అత్యధికంగా ప్రమాదాలు ఇక్కడే జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. మే, జూన్ నెలల్లో తమిళనాడులోని నెవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో జరిగిన రెండు అగ్ని ప్రమాదాలలో 20 మంది కార్మికులు మరణించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఎల్‌జి పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ కావడం వల్ల కనీసం 11 మంది మృతి చెందగా, 100 మంది గాయపడ్డారు. ఇటీవలి కాలంలో ఇది అతిపెద్ద ఘటనలలో ఒకటి నమోదైంది. దీని తరువాత కోవిడ్ -19 సమయంలోనూ, తరువాత కర్మాగారాలు తిరిగి తెరవడానికి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఎ) తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. మొదటి వారంలోనే ఉత్పత్తిని పెంచవద్దని, బదులుగా ట్రయల్ ప్రాతిపదికన అమలు చేయమని వారికి సలహా ఇస్తుంది.

ఉత్పాదక విభాగాలలో గ్యాస్ లీకేజీల కారణంగా ఐదు సంఘటనలు జరిగాయి. ఇందులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం 111 మంది గాయపడ్డారు. బాయిలర్ పేలుడు జరిగిన మూడు సంఘటనలలో 22 మంది ప్రాణాలు కోల్పోగా, 49 మంది గాయపడ్డారు. ఈ కాలంలో తయారీ యూనిట్లలో ఎనిమిది అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇందులో 14 మంది మరణించారు. ఏడుగురు గాయపడ్డారు.

మే నుండి లాక్ డౌన్ సమయంలో పరిమితులతో పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతించింది. జూన్ నుండి ప్రభుత్వం ‘అన్ లాక్’ ప్రక్రియను ప్రారంభమైనప్పుడు నుంచి పరిశ్రమలకు పూర్తిగా స్వేచ్ఛ వచ్చింది.

గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ఇండస్ట్రియల్ గ్లోబల్ యూనియన్ జనరల్ సెక్రటరీ వాల్టర్ సాంచెస్ “భయంకరమైన వాస్తవం ఏమిటంటే..ఈ తీవ్రమైన ప్రమాదాల జరగడానికి పరిశ్రమల వైఫల్య నమూనాను సూచిస్తుంది. ఇంకా ఎక్కువ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది” అని పేర్కొన్నారు. “భద్రతా నియంత్రణలో ఈ రకమైన నిర్లక్ష్యం గమనించినప్పుడు. 1984 భోపాల్ విపత్తు స్థాయిలో పెద్ద విపత్తు సంభవించే అవకాశాన్ని తోసిపుచ్చలేము” అని సాంచెస్ రాశారు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet giriş