iDreamPost
android-app
ios-app

Sai Pallavi : మహేష్ బాబు కాంబో మిస్ అయినట్టేనా

  • Published Jan 19, 2022 | 6:13 AM Updated Updated Jan 19, 2022 | 6:13 AM
Sai Pallavi : మహేష్ బాబు కాంబో మిస్ అయినట్టేనా

ఎన్ని ఆఫర్లు వచ్చినా తన పాత్రకున్న ప్రాధాన్యం నచ్చితేనే సినిమాలు ఒప్పుకునే సాయిపల్లవికి గత ఏడాది రెండు సూపర్ హిట్లు వచ్చాయి. లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ కమర్షియల్ గా కంప్లీట్ సేఫ్ అయిపోయి 2021 సక్సెస్ ఫుల్ మూవీస్ లో చోటు దక్కించుకున్నాయి. రానాతో చేసిన విరాట పర్వం రిలీజ్ మాత్రం అంతు చిక్కడం లేదు. అదిగో ఇదిగో అంటున్నారు కానీ థియేటర్లలో వస్తుందా లేక ఓటిటికి ఇస్తారా అనే విషయంలో ఎలాంటి క్లారిటీ రావడం లేదు. నిర్మాత సురేష్ బాబు సైతం మౌనంగానే ఉన్నారు. హీరో దర్శకుడూ ఇద్దరూ అప్ డేట్ ఇవ్వడం మానేశారు. నెట్ ఫ్లిక్స్ కొందన్నారు కానీ అదీ కన్ఫర్మ్ చేయకుండా నాన్చుతూనే ఉన్నారు.

దీని సంగతి కాసేపు పక్కనపెడితే సాయిపల్లవికి మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో రూపొందబోయే సినిమాలో చెల్లెలి పాత్రను ఆఫర్ చేసినట్టుగా వచ్చిన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. హీరోకు జోడి కాకపోయినా కథలో చాలా కీలకంగా ఈ క్యారెక్టర్ ఉంటుందని అందుకే సాయిపల్లవికి చెప్పారని అంటున్నారు. అయితే తను సున్నితంగా నో చెప్పినట్టు సమాచారం. పూజా హెగ్డే గ్లామర్ షో చేస్తున్న మూవీలో తాను ఎమోషన్లంటూ సిస్టర్ రోల్ చేయడం ఖచ్చితంగా కెరీర్ మీద ప్రభావం చూపిస్తుందని అందుకే వద్దని చెప్పినట్టు వినికిడి. ప్రతిపాదన నిజమే కానీ ఎస్ అనిందా నో చెప్పిందా అనేది మాత్రం బయటికి రాలేదు.

ఆ మధ్య చిరంజీవి భోళా శంకర్ లోనూ ఇదే తరహా ప్రపోజల్ ని వద్దనుకున్నా సాయిపల్లవి ఇప్పుడు మాత్రం ఒప్పుకుంటుందా అంటే చెప్పలేం. అసలే తెలుగులో సిస్టర్ పాత్రలు చేస్తే పేరొస్తుందేమో కానీ కెరీర్ మాత్రం ఊపందుకోదు. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ – అన్నవరం, మహేష్ బాబు అర్జున్ లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మొత్తానికి మంచి కాంబో మిస్ అవుతున్నామన్న మాట. ప్రస్తుతం సర్కారు వారి పాట పూర్తి చేసే పనిలో ఉన్న మహేష్ అది కాగానే త్రివిక్రమ్ సెట్లో అడుగు పెడతాడు. కాకపోతే కొంత జాప్యం జరిగేలా ఉంది. ఏప్రిల్ 1 విడుదల తేదీ దాదాపు వదులుకున్నట్టే. అందుకే ఆ డేట్ కి ఆచార్య వస్తోంది

Also Read : Suriya And Vishal : ఆశలు పెట్టుకున్న సినిమాలూ హ్యాండ్ ఇచ్చాయి

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişjojobet girişjojobet girişcasibomcasibom