iDreamPost
android-app
ios-app

ఆర్ఆర్ఆర్ హీరోల చూపు ఎటువైపు

  • Published Jan 10, 2020 | 12:44 PM Updated Updated Jan 10, 2020 | 12:44 PM
ఆర్ఆర్ఆర్ హీరోల చూపు ఎటువైపు

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తప్ప మరోలోకం లేకుండా ఉంటున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు తమ నెక్స్ట్ మూవీ గురించి నోరు విప్పడం లేదు. జూలైలో ఈ సినిమా విడుదలయ్యే దాకా ఖచ్చితంగా చెప్పిన తేదికే వస్తుందని గ్యారెంటీగా చెప్పలేం. ఇంకో ఆరు నెలల్లో రిలీజ్ పెట్టుకుని ఇప్పటిదాకా ఒక్క ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. షూటింగ్ కూడా చాలా గోప్యంగా చేస్తున్నారు. గెటప్స్ బయటికి రాకుండా రాజమౌళి టీం జాగ్రత్తగా ఉంటూ అంతా పక్కా ప్లానింగ్ తో సహా సాగుతోంది.

దీని తర్వాత చరణ్ అనిల్ రావిపూడితో చేయోచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకవేళ అనుకున్నట్టే సరిలేరు నీకెవ్వరు కనక బ్లాక్ బస్టర్ ఇంకో ఆలోచన లేకుండా అనిల్ తో వెళ్ళిపోతాడు. ఏదైనా తేడా వస్తే కొరటాల శివ లేదా త్రివిక్రమ్ ఎవరు కథతో సిద్ధంగా ఉంటే వాళ్ళతో అనేలా రెడీగా ఉన్నాడట. ఇక తారక్ సంగతి చూస్తే కెజిఎఫ్ తో దేశవ్యాప్త దృష్టిని ఆకట్టుకున్న ప్రశాంత్ నీల్ తో మైత్రి మూవీ మేకర్స్ ఓ మూవీని ప్లాన్ చేసినట్టు గతంలోనే టాక్ వచ్చింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో మరోసారి జట్టు కట్టేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నాడు. గత ఏడాది రొటీన్ ఫ్యాక్షన్ కథలోనూ చాలా స్టైలిష్ గా తీర్చిదిద్దిన విధానానికి ఫిదా అయిపోయిన యంగ్ టైగర్ కథ చెప్పాలే కాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు సన్నిహితుల మాట. ఒకవేళ ఇవి కుదరకపోయినా కొరటాల శివతో సైతం చర్చలు జరుపుతున్నట్టు మరో న్యూస్ ఉంది. మొత్తానికి ఇంకో నాలుగు అయిదు నెలలు ఆగితే కాని ఈ ఇద్దరు హీరోల ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ వచ్చేలా లేదు. అభిమానుల ఫోకస్ కూడా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మీదే ఉంది.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın aljojobet güncelHoliganbet Girişjojobet günceljojobet güncel