iDreamPost
android-app
ios-app

జగన్ రెడ్డి ఏనాడైనా సొంతంగా సహాయం చేశాడా? రాధాకృష్ణ ప్రశ్న..

  • Published Jan 10, 2022 | 2:23 AM Updated Updated Mar 11, 2022 | 10:26 PM
జగన్ రెడ్డి ఏనాడైనా సొంతంగా సహాయం చేశాడా? రాధాకృష్ణ ప్రశ్న..

ప్రతి ఆదివారం కొత్తపలుకు పేరిట వైసీపీ ప్రభుత్వం పై , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దుమ్మెత్తి పోసే రాధాకృష్ణ ఆక్రోశం రోజురోజుకీ తగ్గేదేల్యే అంటూ పరాకాష్టకి చేరుకొంటూ కొత్త పోకడలు పోతోంది . జగన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకు యత్నిస్తే ఎవరూ అడ్డుకోలేదు కానీ అలా ప్రచారం చేసుకొంటున్నారు అని చెప్పే ప్రయత్నం చేసిన రాధాకృష్ణ , ప్రభుత్వ డబ్బు పప్పు బెల్లాల్లా పంచిపెట్టటం తప్ప తన సొంత నిధులతో ఒక్క పేదవాడికైనా చదువు చెప్పించారా , ఒక్కరికైనా వైద్యం చేయించారా అంటూ ప్రశ్నించడం చూస్తే మనిషి ప్రాథమిక అవసరాలైన విద్యా , వైద్యం ప్రభుత్వ కనీస బాధ్యత అన్న విషయం విస్మరించడమే కాక అందుకు ప్రభుత్వాలు డబ్బు ఖర్చు చేయడం దుర్మార్గం అన్నట్లుంది ఏబీఎన్ రాధాకృష్ణ రాతల తీరు . కేవలం చంద్రబాబు , టీడీపీ గురించి అపరిమితమైన భజన , ప్రచారం చేయడం , వైసీపీ పార్టీ , జగన్ ల పై దుష్ప్రచారం చేయడం తప్ప ఇతర వ్యక్తుల గురించి , నాయకుల గురించి వారి సేవాతత్పరత గురించి ఏమీ తెలుసుకోకుండా , కనీస అవగాహన లేకుండా తన ఇష్టానుసారం ఆరోపణలు చేస్తూ రాసిపడేస్తాడు అనిపించక మానదు .

వెంకటప్పయ్య మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గురించి తెలుసా రాధాకృష్ణ ? .

తను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదైనా మేలు చేయాలని సంకల్పించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2007 లో తన చిన్ననాటి గురువు వెంకటప్పయ్య గారి పేరుతో పన్నెండు ఎకరాల సువిశాల ప్రాంగణంలో 2500 మంది విద్యార్థులకు సరిపడా వసతులతో వెంకటప్పయ్య మెమోరియల్ స్కూల్ స్థాపించారు . నిర్వహణ భాద్యతలు తన కోడలు వైఎస్ జగన్ సతీమణి భారతికి అప్పజెప్పారు .

పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన సాగే ఈ స్కూల్ లో విద్య ఉచితం . అంతే కాదు పిల్లలకు కావాల్సిన బుక్స్ , బ్యాగ్స్ , యూనిఫార్మ్ , స్టేషనరీ మొత్తం వైఎస్సార్ ఫౌండేషన్ నుండి అందించడమే కాకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన నామమాత్రపు ఫీజులు , ఎక్జాం ఫీజులు కూడా వైఎస్సార్ ఫౌండేషన్ నుండే చెల్లిస్తారు . తర్వాతి రోజుల్లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పులివెందుల పట్టణంలో మరో రెండు బ్రాంచ్ లతో స్కూల్ ని విస్తరించారు .

Also Read : ప్రభుత్వ సలహాదారుడిగా మాజీ ఎంపీ జ్ఞానేంద్రా రెడ్డి

మెయిన్ క్యాంపస్ లో ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకూ క్లాసులు నిర్వహిస్తుండగా , ఇతర బ్రాంచ్ లలో ఎల్కేజి నుండి ఐదవ తరగతి వరకూ విద్యాబోధన సాగుతుంది . పేరుకి ఉచిత పాఠశాల అయినా కార్పొరేట్ స్కూల్స్ తలదన్నే రీతిలో కంప్యూటర్ , సైన్స్ లాబ్ లు , యాక్టివిటీ రూమ్స్ , గేమ్ జోన్స్ , విశాలమైన ప్లే గ్రౌండ్స్ తో అత్యున్నత ప్రమాణాలతో నేటికీ విజయవంతంగా నిర్వహిస్తున్నారు .

స్కూల్ అడ్మిషన్స్ విషయంలో ఏ విధమైన రెకమెండేషన్స్ ని అనుమతించకుండా కేవలం విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితుల రీత్యా ఫీజులు కట్టలేని వారిని ఎంపిక చేసి జాయిన్ చేసుకొంటారు . ఈ క్రమంలో స్కూల్ కెపాసిటీకి మించి అప్లికేషన్లు వచ్చిన సందర్భాల్లో సామర్ధ్యం మేరకు మాత్రమే స్కూల్ లో జాయిన్ చేసుకొని మిగతా విద్యార్థులకు వైఎస్సార్ ఫౌండేషన్ నుండి ఫీజులు కడుతూ ఇతర ప్రయివేట్ పాఠశాలల్లో చదివించేవారు .

ప్రతి ఏటా వేసవి సెలవుల్లో స్కూల్ టీచర్స్ కు ఫోనెటిక్స్ , ఇతర కమ్యూనికేషన్ సబ్జెక్ట్స్ లో శిక్షణ కొరకు బెంగుళూర్ లాంటి ప్రాంతాలు తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తారు . అంతే కాదు ప్రధాన స్కూల్ కి అనుబంధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ , మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకు విడివిడిగా మరో రెండు స్కూల్స్ స్థాపించి వారి అభ్యున్నతికి పాటు పడుతోంది వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని వెంకటప్పయ్య స్కూల్ .

పన్నెండేళ్ల పాటు తమ స్వంత నిధులతో ఈ స్కూల్ ని సమర్థంగా నిర్వహిస్తూ విద్యార్థులకు పూర్తి స్థాయి ఉచిత విద్య అందించడమే కాకుండా , యూనిఫార్మ్ , బుక్స్ , స్టేషనరీ అన్నీ ఉచితంగా అందించి ఎందరినో అత్యున్నత స్థానాలకు పంపిన అనుభవం నుండి పుట్టుకొచ్చిన అభివృద్ధి పథకాలే నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు సకల సౌకర్యాలతో సుందరంగా తీర్చిదిద్దే ప్రక్రియ , విద్యా కానుక పథకం ద్వారా పిల్లలకు అవసరమైన బుక్స్ , యూనిఫార్మ్ , స్టేషనరీ ఉచితంగా అందించడం , డ్రాపవుట్స్ తగ్గించి నూరు శాతం అక్షరాస్యత సాధించే క్రమంలో భాగంగా అమ్మ ఒడి అందించడం అని చెప్పవచ్చు .

Also Read : అదే ఒడుపు.. ఎడతెగని ఏడుపు..

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbet güncel girişHoliganbet GirişMadridbetMadridbet giriş